Asianet News TeluguAsianet News Telugu

గ్రేటర్‌లో వెయ్యి కొత్త బస్సులు.. పాతవన్నీ తుక్కుగానే, టీఎస్ఆర్టీసీ నిర్ణయం

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1000 కొత్త బస్సులను తిప్పాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించింది. పాత బస్సులను తుక్కుగా మార్చడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

tsrtc planning to run 1000 new buses in greater hyderabad circle
Author
First Published Nov 29, 2022, 2:35 PM IST

టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆర్టీసీ గాడిలో పడి ఇప్పుడిప్పుడే లాభాల్లో నడుస్తోంది. ఈ క్రమంలో ప్రయాణీకులకు మరిన్ని మెరుగైన సదుపాయాలు అందించేందుకు ఆర్టీసీ యాజమాన్యం చర్యలు చేపడుతోంది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తగా వెయ్యి బస్సులను తీసుకురావాలని ఆర్టీసీ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. మొత్తం 720 పాత బస్సులను స్క్రాప్‌గా మార్చి.. వాటి స్థానంలో 1020 కొత్త బస్సులను తిప్పనున్నట్లుగా వెల్లడించింది. సిటీ బస్సులు, సూపర్ లగ్జరీ, ఎలక్ట్రిక్ బస్సులు ఇందులో వుంటాయని అధికారులు తెలిపారు. 

మరోవైపు దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ స్టూడెంట్ పాస్‌లను అనుమతించేందుకు ఆర్టీసీ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. సిటీ బస్సుల్లోనే స్టూడెంట్ పాస్‌లను అనుమతించడం వల్ల విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా రూట్లలో తిరిగే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ విద్యార్ధుల పాస్‌లను అనుమతించాలని ఆర్టీసీ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. 

ALso REad:ఆ ప్రయాణికులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్.. ఇకపై హైదరాబాద్ లో ఆ రెండు గంటలు ఉచిత ప్రయాణం...

ఇదిలా ఉండగా, ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ 12 రోజుల పాటు వినూత్న కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆగస్టు 15వ తేదీన పుట్టిన చిన్నారులందరికీ వారికి 12  సంవత్సరాలు పూర్తయ్యేంత వరకు రాష్ట్రంలో అన్ని సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వృద్ధులకు ఈనెల 15న ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించింది. టీ-24 బస్ టికెట్ ను ఆగస్ట్ 15న రూ. 75కే  విక్రయించింది. అలాగే తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన వారికి తిరిగి ఇంటికి వెళ్లడానికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది తెలంగాణ ఆర్టీసీ. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ఇకముందు కూడా కొనసాగించాలని నిర్ణయించింది ఆర్టీసీ. 

Follow Us:
Download App:
  • android
  • ios