Asianet News TeluguAsianet News Telugu

Kinnera Mogulaiah: ఆర్టీసీ సేవలపై పాట.. కిన్నెర మొగులయ్యకు సజ్జనార్‌ బంపర్‌ ఆఫర్‌

కిన్నెర మొగులయ్య (kinnera mogulaiah) తెలంగాణ ఆర్టీసీ (Telangana RTC) సేవలను కిన్నెరతో పాట రూపంలో చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీంతో టీఎస్‌ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Sajjanar).. మొగులయ్యకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. 

TSRtc MD Sajjanar bumper to singer kinnera mogulaiah for sings song On rtc
Author
Hyderabad, First Published Nov 25, 2021, 1:57 PM IST

భీమ్లా నాయక్ లో తన గానం వినిపించిన కిన్నెర మొగులయ్య (kinnera mogulaiah) ఈ మధ్య చాలా పాపులర్ అయ్యారు. బీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ పాడినప్పటి నుంచి మొగులయ్య పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి కిన్నెర మొగులయ్య మరోసారి తన గాత్రంతో అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే ఈసారి సినిమా కోసం ఆయన పాట పాడలేదు.. తెలంగాణ ఆర్టీసీ (Telangana RTC) సేవలను కిన్నెరతో పాట రూపంలో చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీంతో టీఎస్‌ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Sajjanar).. మొగులయ్యకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. 

వివరాలు.. ఇటీవల తన కూతురు వివాహానికి మొగులయ్య ఆర్టీసీ బస్సును బుక్‌ చేసుకున్నారు. ఈ సందర్భంగా బస్సు ముందు నిలబడి ఆర్టీసీ సేవలను ప్రశంసిస్తూ పాట అందుకున్నారు. అది బస్సు కాదు..తల్లిలాంటిదని..శభాష్ సజ్జనార్ సర్.. అంటూ ప్రశంసించారు. కిన్నెర వాయిస్తూ పాడిన ఆ పాటకు సామాజిక మాధ్యమాల్లో మంచి స్పందన వచ్చింది. ఆర్టీసీ బస్సులోన ప్రయాణం ఆనందకరమని, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని ఈ పాట ద్వారా మొగులయ్య సందేశం ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఇది కాస్తా సజ్జనార్ దృష్టికి రావడంతో.. ఆయన ఫుల్ ఖుష్ అయ్యారు. 

ఈ క్రమంలోనే మొగులయ్యను బస్‌భవన్‌లో (bus bhavan) ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ బుధవారం సన్మానించారు. ఆర్టీసీ బస్సుల్లో (కేటగిరీపై పరిమితితో) రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా బస్సు పాస్‌ను అందజేశారు. భవిష్యత్తులో ఆయన ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడ ఆర్టీసీ సేవలను తన పాట ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎండీ సజ్జనార్‌ కోరారు.

 

ఇక, కిన్నెర మొగులయ్య అసలు పేరు దర్శనం మొగులయ్య. ఆయన స్వగ్రామం నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలంలోని అవుసలికుంట. నల్లమల అడవుల్లోని మాదిగ (దళిత) కుటుంబానికి చెందినవాడు. అరవై రెండేళ్ల మొగులయ్య తన కుటుంబంలో ఐదవ తరం కళాకారుడు. 8 సంవత్సరాల వయస్సులో కిన్నెర వాయించడం తన తండ్రి యెల్లయ్య నుండి నేర్చుకున్నాడు. అంతరించిపోతున్న కిన్నెర వాద్య కళను కాపాడుతున్న మొగులయ్యను తెలంగాణ ప్రభుత్వం గుర్తించి... ఉగాది పురస్కారంతో ఘనంగా సత్కరించింది. అయితే ఇటీవల బీమ్లా నాయక్‌ టైటిల్ సాంగ్‌తో మొగులయ్య పేరు మారుమోగిపోతుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios