తెలంగాణ ఆర్టీసి ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. లగ్జీ, ఎక్స్‌ప్రెస్ బస్సు టికెట్ ధరలపై రూ. 1 పెంచింది. కాగా, ఏసీ, సూపర్ లగ్జరీ బస్సులపై రూ. 2 పెంచుతున్నట్టు టీఎస్ఆర్టీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. పల్లె వెలుగు బస్సు టికెట్ ధరలను రౌండప్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చింది.
న్యూఢిల్లీ: తెలంగాణ ఆర్టీసీ హోలీ పండుగ రోజు ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. రాత్రికి రాత్రే ధరలు పెంచి అమలు చేసే నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలను నేటి నుంచే అమలు చేస్తున్నది. లగ్జరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల టికెట్‌లపై రూ. 1 పెంచింది. సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల టికెట్ ధరలపై రూ. 2 పెంచింది. కాగా, పల్లె వెలుగు టికెట్ల ధరలను రౌండప్ చేసింది. చిల్లర సమస్యను దృష్టిలో ఉంచుకుని ఈ రౌండప్ నిర్ణయం తీసుకున్నట్టు టీఎస్ఆర్టీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. అలాగే, టోల్ ప్లాజా చార్జీని కూడా ఒక రూపాయి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
పల్లె వెలుగు బస్సుల్లో చిల్లర సమస్య ఎక్కువగా ఉంటున్నది. ఇది కండక్టర్లకు అదనపు భారంగా మారుతున్నది. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకునే రౌండప్ చేసే నిర్ణయం తీసుకున్నట్టు టీఎస్ఆర్టీసీ వెల్లడించింది. టికెట్ ధర రూ. 13 ఉంటే దాన్ని రౌండప్‌గా రూ. 15 అని, అలాగే, టికెట్ ధర రూ. 17 ఉంటే దాన్ని రౌండ్ ఫిగర్ రూ. 15కు తగ్గించనుంది. అయితే, దీనికి సంబంధించి ఇంకా ఉత్తర్వులు రాలేవు. త్వరలోనే ఆర్టీసీ ఈ ధరలను పేర్కొంటూ ఉత్తర్వులు విడుదల చేయాల్సి ఉంది.
ఇదిలా ఉండగా, ప్రయాణికుల కోసం టీఎస్ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. Ramappa Temple - Laknavaram ఒకే సారి చూసే అవకాశం కల్పిస్తోంది తెలంగాణ ఆర్టీసీ. ప్రయాణికుల కోసం రామప్ప దర్శనం పేరిట ప్రత్యేక Bus serviceలను తీసుకువచ్చింది.
ప్రభుత్వ సెలవు దినాలు, ప్రతి రెండవ శనివారం ఆర్టీసీ ప్రత్యేక ఎక్స్ప్రెస్ సర్వీసులను నడపనున్నట్లు ఎండి సజ్జనార్ తెలిపారు. ఈ సర్వీసులు ఉదయం 9 గంటలకు హనుమకొండ డిపో నుంచి బయలుదేరనున్నట్లు వెల్లడించారు. ఈ సదుపాయాలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు డిపో మేనేజర్ 9959226048 నెంబర్ ను సంప్రదించాలని ట్వీట్ చేశారు ఎండి సజ్జనార్.
కాగా, ఫిబ్రవరిలో జరిగిన సమ్మక్క సారలమ్మ జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులతో భక్తులకు ఇబ్బందులు కలగకుండా, సౌకర్యవంతమైన ప్రయాణం ఉండేలా చేసింది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ.. మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు హాజరవ్వాలంటే.. సమ్మక్క సారలమ్మ గద్దె దగ్గరకు తొందరగా వెళ్లాలంటే ఆర్టీసి బస్సు ఎక్కాలని ఆ సందర్భంగా ఆయన ప్రయాణికులకు సూచించారు. మేడారం విత్ టిఎస్ ఆర్టీసి యాప్ ప్రవేశపెట్టారు. ఆర్టీసి చరిత్రలోనే మొదటిసారి ఈయాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని సజ్జనార్ పేర్కొన్నారు. ఈ యాప్ లో ఆర్టీసీ సర్వీసులు, మేడారం జాతర విశిష్టతో పాటు ఇతర టూరిస్టు ప్రాంతాలు, ప్యాకేజీలతోపాటు ఎమర్జెన్సీ సర్వీసు నెంబర్లు, సమీపంలోని హోటల్స్ కంటాక్టులను ఉంచామని తెలిపారు.
50 ఏళ్లుగా ఆర్టీసీ మేడారానికి బస్సులను నడుపుతోందని ఆయన గుర్తుచేశారు. మొదట రెండెంకల బస్సులతో 1970లో ప్రారంభమయ్యిందని.. ప్రస్తుతం అది 7 వందలకు పెరిగిందని సజ్జనార్ అన్నారు. గతేడాది 19 లక్షలకు పైగా భక్తులను మేడారం చేర్చామని... అప్పుడు 3వేలకు పైగా బస్సులు- 50వేలకు పైగా ట్రిప్పులు నడిపామని ఆయన వెల్లడించారు. మేడారం జాతరను రెవెన్యూగా చూడలేదని .. గతేడాది 30 కోట్ల ఆదాయం వచ్చిందని సజ్జనార్ పేర్కొన్నారు. ఈ సారి 3,845 బస్సులు నడుపుతున్నామని.. మొత్తం 51 పాయింట్స్ నుంచి మేడారానికి బస్సులు తిరుగుతాయని చెప్పారు.
