Asianet News TeluguAsianet News Telugu

Baji Reddy Goverdhan: టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ ఉదారత.. సంస్థ నుంచి వచ్చే జీతం వద్దంటూ లేఖ..

టీఎస్ ఆర్టీసీపై (TSRTC) ఆ సంస్థ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ (Baji Reddy Goverdhan) ఉదారతను చాటుకున్నారు. ర్టీసీ చైర్మన్‌గా సంస్థ నుంచి తాను ఎలాంటి జీత‌భ‌త్యాలు తీసుకోకూడదనే నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సంస్థ ఎండీ స‌జ్జ‌నార్‌కు (Sajjanar) లేఖ రాశారు.
 

TSRTC chairman Baji Reddy Goverdhan decides to not take salary
Author
Hyderabad, First Published Nov 24, 2021, 3:59 PM IST

టీఎస్ ఆర్టీసీపై (TSRTC) ఆ సంస్థ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ (Baji Reddy Goverdhan) ఉదారతను చాటుకున్నారు. ఆర్టీసీ చైర్మన్‌గా సంస్థ నుంచి తాను ఎలాంటి జీత‌భ‌త్యాలు తీసుకోన‌ని సంస్థ ఎండీ స‌జ్జ‌నార్‌కు (Sajjanar) లేఖ రాశారు. శాస‌న‌స‌భ స‌భ్యునిగా వ‌స్తున్న జీత‌భ‌త్యాలు తనకు చాల‌ని ఆయ‌న త‌న లేఖ‌లో పేర్కొన్నారు. ఆర్టీసీ న‌ష్టాల్లో ఉన్నందున భారం మోప‌డం ఇష్టం లేనందునే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా బాజిరెడ్డి గోవర్దన్ స్ప‌ష్టం చేశారు.

బాజిరెడ్డి గోవర్దన్ తీసుకున్ని నిర్ణయం పట్ల టీఎస్ ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. బాజిరెడ్డి నిర్ణ‌యం ప‌ట్ల ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక, ప్రస్తుతం బాజిరెడ్డి గోవర్దన్ నిజామాబాద్ రూరల్ (nizamabad rural) నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ పార్టీ శాసన సభ్యునిగా ఉన్నారు. ఆయనను ఈ ఏడాది సెప్టెంబర్‌లో టీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌గా (tsrtc chairman) నియమిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 

నిజామాబాద్ సిరికొండ మండ‌లం రావుట్ల‌లో జ‌న్మించిన గోవ‌ర్ధ‌న్‌.. ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాలో కీల‌క నేత‌గా ఎదిగారు. 1973లో పోలీస్ పటేల్‌గా పనిచేశారు. ఆయన మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చాక చిమన్‌పల్లి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం సిరికొండ ఎంపీపీగా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 1994లో ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్ధిగా పోటిచేసి ఓడిపోయారు.

ఆ తర్వాత 1999లో ఆర్మూర్ నుంచి, 2004లో బాన్సువాడ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బాజిరెడ్డి గోవర్దన్ గెలుపొందారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున నిజమాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 

Follow Us:
Download App:
  • android
  • ios