Asianet News TeluguAsianet News Telugu

డీజిల్ సెస్‌ పేరుతో బాదుడే బాదుడు... భారీగా పెరగనున్న టీఎస్ఆర్టీసీ బస్ ఛార్జీలు, రేపటి నుంచే అమల్లోకి..?

ప్రజలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) షాకిచ్చింది. మరోసారి డీజిల్ సెస్ పెంచుతున్నట్లు తెలిపింది. దీంతో రేపటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో అదనపు డీజిల్ సెస్‌ను వసూలు చేయనున్నారు. పల్లె వెలుగులో 250 కిలోమీటర్ల దూరానికి గాను రూ. 5 నుంచి 45కి, ఎక్స్‌ప్రెస్‌లో 500 కిలోమీటర్ల దూరానికి గాను రూ.5 నుంచి రూ.90కి పెంచింది. 
 

tsrtc bus ticket prices increased from tomorrow due to diesel cess hike
Author
Hyderabad, First Published Jun 8, 2022, 9:28 PM IST

ప్రజలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) షాకిచ్చింది. మరోసారి డీజిల్ సెస్ పెంచుతున్నట్లు తెలిపింది. దీంతో రేపటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో అదనపు డీజిల్ సెస్‌ను వసూలు చేయనున్నారు. పల్లె వెలుగులో 250 కిలోమీటర్ల దూరానికి గాను రూ. 5 నుంచి 45కి, ఎక్స్‌ప్రెస్‌లో 500 కిలోమీటర్ల దూరానికి గాను రూ.5 నుంచి రూ.90కి, డీలక్స్ బస్సుల్లో 500 కిలోమీటర్లకు రూ. 5 నుంచి 125కి, సూపర్ లగ్జరీలో 500 కిలోమీటర్లకు రూ.10 నుంచి రూ.130కి, ఏసీ సర్వీసుల్లో 500 కిలోమీటర్లకు రూ.10 నుంచి రూ.170కి పెంచుతున్నట్లు ఆర్టీసీ తెలిపింది. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డీజిల్ సెస్ పెంపు లేదని యాజమాన్యం పేర్కొంది. దీనిపై ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. అదనపు డీజిల్ సెస్ అనివార్యమని పేర్కొన్నారు. తక్కువ దూరం ప్రయాణించే వారిపై భారం పడకుండా స్లాబ్‌లు రూపొందించినట్లు బాజిరెడ్డి తెలిపారు. 

కాగా.. గతంలో రౌండప్, టోల్‌ప్లాజాలు, ప్యాసింజర్స్ సెస్ పేరిట ఒకసారి ఛార్జీలు పెంచిన సంగతి తెలిసిందే. తర్వాత ఆర్టీసీ మరోసారి ఏప్రిల్‌లో డీజిల్ సెస్ పేరుతో ప్రయాణీకులపై భారం మోపింది. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసులలో ఒక్కో ప్రయాణికుడి నుంచి డీజిల్ సెస్ కింద రూ.2, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్, ఏసీ సర్వీసులలో ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.5 చొప్పున పెంచిన సంగతి తెలిసిందే. 
 

Follow Us:
Download App:
  • android
  • ios