Asianet News TeluguAsianet News Telugu

కోరుట్ల ఆర్టీసీ డిపోలో అగ్ని ప్రమాదం.. రాజధాని బస్సు దగ్దం..

జగిత్యాల జిల్లా కోరుట్ల ఆర్టీసీ డిపోలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఆర్టీసీ రాజధాని బస్సు దగ్దం అయింది.

TSRTC Bus catches fire at korutla Bus depot ksm
Author
First Published Oct 8, 2023, 2:20 PM IST

జగిత్యాల జిల్లా కోరుట్ల ఆర్టీసీ డిపోలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఆర్టీసీ రాజధాని బస్సు దగ్దం అయింది. వివరాలు.. కోరుట్ల ఆర్టీసీ డిపోలో రాజధాని బస్సులో డీజిల్ నింపిన తర్వాత మంటల చెలరేగినట్టుగా తెలుస్తోంది. దీంతో అక్కడి వారంతా భయాందోళన చెందారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న డిపో అధికారులు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్దమైంది. అయితే పక్కనే ఉన్న ఫ్యూయల్‌ స్టేషన్‌కు మంటలు వ్యాపించకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 

బస్సు బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నట్లు టీఎస్‌ఆర్టీసీ అధికారులు తెలిపారు. కాగా,  ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios