Asianet News TeluguAsianet News Telugu

ఎంజీబీఎస్ లో మహిళా ప్రయాణికులు కోసం బేబీ ట్రాలీ సేవలు.. టీఎస్ ఆర్టీసీ వినూత్న ప్రయోగం...

ప్రయాణికుల సేవలో టీఎస్ఆర్టీసీ మరో ముందుడుగు వేసింది. చిన్నపిల్లల తల్లులైన మహిళా ప్రయాణికులకు ఓ బంపర్ సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. 

TSRTC begins 'Baby Trolley' services at MGBS, Hyderabad
Author
Hyderabad, First Published Mar 11, 2022, 7:46 AM IST | Last Updated Mar 11, 2022, 7:46 AM IST

హైదరాబాద్ : ఆర్టీసీ సేవల్లో మరో ముందడుగు పడింది. మహిళా ప్రయాణికులకు ముఖ్యంగా చిన్నపిల్లల తల్లులకు TSRTC తీపికబురు అందించింది. పిల్లలను ఎత్తుకుని, లగేజ్ మోసుకెళ్లే భారం లేకుండా.. Baby Trolley సేవలను అందుబాటులోకి తేవడంతో చిన్నపిల్లల తల్లులైన మహిళా ప్రయాణికులకు పెద్ద ఉపశమనం లభించినట్లయ్యింది. 

హైదరాబాద్‌లోని ఎమ్‌జిబిఎస్‌లో టిఎస్‌ఆర్‌టిసి 'బేబీ ట్రాలీ' సేవలను ప్రారంభించింది. ఎమ్జీబీఎస్ చాలా పెద్ద బస్సు ప్రాంగణం.. ఇక్కడికి వచ్చిన మహిళా ప్రయాణికులు పిల్లలను, లగేజ్ ను వేసుకుని బస్సులకోసం విశాల మైన ప్రాంగణంలో తిరగడం ఇబ్బంది.. దీంతో బస్సులు మిస్ చేసుకోవడం.. లాంటివి జరగకుండా.. వారి సౌకర్యార్థం తమ పిల్లలను లగేజీతో పాటు తీసుకెళ్లేందుకు ఇబ్బంది పడకుండా ఈ సర్వీసును ప్రారంభించామని ఎంజీబీఎస్ మేనేజర్ రంగారెడ్డి తెలిపారు.

కాగా, ప్రభాస్ పూజాహెగ్డే నటించిన రాధే శ్యామ్ క్రేజ్ ని ఆర్టీసీ ఎండి సజ్జనార్ వాడేసుకుంటున్నారు. ప్రభాస్ చిత్రాన్ని ఇలా కూడా వాడుకోవచ్చా అంటూ సజ్జనార్ ట్వీట్ పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సజ్జనార్ ఆ సంస్థని మరింత అభివృద్ధి చేసేందుకు సజ్జనార్ చాలా కృషి చేస్తున్నారు. సోషల్ మీడియాని ఉపయోగించుకుని ఆర్టీసీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. 

ఏదైనా క్రేజీ మూవీ రిలీజవుతున్నప్పుడు దానిని ఉపయోగించుకుని ఆర్టీసీకి పబ్లిసిటీ క్రియేట్ అయ్యేలా ప్రయత్నిస్తున్నారు. ఆర్టీసీ బస్సులోనే జర్నీ సురక్షితం అని తెలియజెప్పేలా రాధే శ్యామ్ పోస్టర్ తో ఉన్న మీమ్ ని సజ్జనార్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ నెటిజన్లని విశేషంగా ఆకట్టుకుంటోంది. 

ఈ మీమ్ లో ప్రభాస్ పూజా హెగ్డే ఆర్టీసీ గురించి మాట్లాడుకుంటున్నట్లు ఉంది. చాలా రోజుల తర్వాత కలిశాం.. ఎటైనా టూర్ వెళదామా అని ప్రభాస్ అడగగా.. వెళదాం కానీ ఆర్టీసీ బస్సులోనే వెళదాం.. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం అంటూ పూజా హెగ్డే ప్రభాస్ కి చెబుతుంది. దీనితో సజ్జనార్ వాడకం మాములుగా లేదుగా అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా, టీఎస్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి VC Sajjanar ఆర్టీసీ అభివృద్ధికి తగు చర్యలు తీసుకుంటున్నారు. RTC Travel ఎంతో సురక్షితం అని తెలియజేయడానికి ఆయనే స్వయంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. 

ఈ క్రమంలో నిరుడు నవంబర్ 30న సజ్జనార్ కు సంబంధించి మరో వీడియో Social mediaలో వైరల్ అవుతోంది. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. దీనిలో సజ్జనార్ డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఆ వివరాల్లోకి వెడితే.. వీసీ సజ్జనార్ తన కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలిసి ఎక్కడికో వెల్తున్నారు. ఈ పర్యటన కోసం ఆయన ఆర్ టీసీ బస్సును ఎన్నుకున్నారు. బంధు మిత్రులు, కుటుం సభ్యులతో కలిసి ఇలా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. ఇక బస్సులో మ్యూజిక్ ప్లే అవుతుండగా.. అందరూ చిన్నపాటి స్టెప్పులు వేశారు. అందరితో పాటు సజ్జనార్ కూడా రెండు స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ viral అవుతోంది. 

ఇది చూసిన నెటిజనుల.. ‘ఆర్టీసీ ప్రయాణం సురక్షితం, సుఖమయం అంటూ ప్రచారాలకు మాత్రమే పరిమితం కాకుండా స్వయంగా మీరు ఆస్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మీరు గ్రేట్ సార్’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios