TSPSC: జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష.. టీఎస్‌పీఎస్‌సీ ప్రకటన
టీఎస్‌పీఎస్‌సీ ఫిబ్రవరి 19వ తేదీన 563 ఉద్యోగాలకు గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు ప్రిలిమినరీ పరీక్ష జూన్ 9వ తేదీన నిర్వహించనున్నట్టు తాజా సర్క్యూలర్‌లో వెల్లడించింది.
TSPSC: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 సర్వీసెస్ జనరల్ రిక్రూట్‌మెంట్ కోసం ప్రిలిమినరీ పరీక్షకు తేదీ ప్రకటించింది. జూన్ 9వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్‌సీ సోమవారం ఓ సర్క్యూలర్ జారీ చేసింది.
ఫిబ్రవరి 19వ తేదీన టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ 1 పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పలు డిపార్ట్‌మెంట్లకు సంబంధించి 563 గ్రూప్ 1 సర్వీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు జూన్ 9వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది.
2022 ఏప్రిల్ లో విడుదల చేసిన నోటిఫికేషన్ ను రద్దు చేసిన గంటల వ్యవధిలోనే కొత్త నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 563 గ్రూప్-1 పోస్టులకు టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 23 నుండి మార్చి 14వ తేదీ వరకు ఆన్ లైన్ లో ధరఖాస్తును స్వీకరించనున్నారు.
Also Read: బీజేపీ, బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలపై అసెంబ్లీలో చర్చిస్తారా?: సీఎం రేవంత్ రెడ్డి సవాల్
పోస్టుల వివరాలు
గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్: 41 పోస్టులు
డీఎస్పీ:115 పోస్టులు
ఆర్డీఓ:04 పోస్టులు
డీపీఓ:07 పోస్టులు
జిల్లా రిజిస్ట్రార్:6 పోస్టులు
డిప్యూటీ కలెక్టర్లు: 45 పోస్టులు
సీటీఓ:48 పోస్టులు
అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండ్:30 పోస్టులు
సాంఘిక సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు:3 పోస్టులు
జిల్లా బీసీ అభివృద్ది అధికారి: 5పోస్టులు
జిల్లా గిరిజన సంక్షేమ అధికారి:2 పోస్టులు
జిల్లా ఉపాధి కల్పన అధికారి:5 పోస్టులు
అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్:38 పోస్టులు
ఎంపీడీఓ:140 పోస్టులు
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్:41 పోస్టులు