TSPSC PAPER LEAK CASE: టీఎస్పీఎస్సీ కేసులో కీలక పరిణామం.. నిందితులకు దిమ్మతిరిగే షాక్
TSPSC PAPER LEAK CASE: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజి కేసులో నిందితులకు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. కోర్టు విచారణకు హాజరుకాని నిందుతులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులకు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఏడుగురిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది.
TSPSC PAPER LEAK CASE: తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజి కేసులో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. లీకేజి కేసులో నిందితులకు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. కోర్టు విచారణకు హాజరుకాని నిందుతులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు విచారణకు హాజరుకాని ఏడుగురు నిందితులకు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఆ నిందితులను వెంటనే అదుపులోకి తీసుకొని కోర్టు ముందు హాజరు పరచాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది.
శుక్రవారం రోజున నిందితులందరినీ విచారణ కొరకు హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే.. కోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకుండా శనివారం జరిగిన విచారణకు నిందితులు A17, 18, 23, 25, 27, 28, A37 హాజరు కాలేదు. విచారణకు రావడం లేదని నిందితులు గైర్హాజరు పిటిషన్‌ను దాఖలు చేశారు. అయితే నిందితుల అనుమతి నిరాకరిస్తూ.. ఆ ఏడుగురిపై నాంపల్లి హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
టీఎస్‌పీఎస్సీ పరీక్ష పేపర్ లీక్ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారిస్తున్న విషయం ఇక్కడ ప్రస్తావించదగిన విషయం. ఈ కేసులో దాదాపు 100 మంది అనుమానితులను దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. నిందితులపై భారతీయ శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్లు 318, 409, 420, 411, 120 (బి), 201 కింద అభియోగాలు మోపారు. వారిపై ఐటి చట్టంలోని వివిధ సెక్షన్లు కూడా ఉన్నాయి.
పరీక్ష పేపర్ లీక్ విషయం మార్చి 13న వెలుగులోకి రావడంతో పోలీసులు రంగంలోకి దిగి పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో నెట్‌వర్క్ అడ్మిన్‌గా పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డిలతో సహా తొమ్మిది మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కమిషన్ కార్యాలయంలోని కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌లోని కంప్యూటర్‌లో కొన్ని పరీక్షల ప్రశ్నపత్రాలను దొంగిలించి సొమ్ము చేసుకున్నారు.