పోలీస్ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి: తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిబంధన


తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాలకు ధరఖాస్తు చేసుకొనే అభ్యర్ధులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు సూచించింది. రిజిస్ట్రేషన్ చేసుకొన్నవారికే ధరఖాస్తు చేసుకోనే అవకాశం కల్పించింది బోర్డు.

TSLPRB Introduces Registration Compulsory To Police Jobs


హైదరాబాద్: Telangana రాష్ట్రంలో Police ఉద్యోగాలకు ధరఖాస్తు చేసుకొనే అభ్యర్ధులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు సూచించింది.ఈ మేరకు ఈ నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. 

Registration చేసుకొన్న అభ్యర్ధులకు మాత్రమే ధరఖాస్తు చేసుకొనే వెసులుబాటును కల్పించింది పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ లో ఉద్యోగాల కోసం ధరఖాస్తు చేసే సమయంలో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసినట్టుగానే పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డులో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాథమిక వివరాలతో TSLPRB వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాథమిక వివరాలతో తొలుత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

రిజిస్ట్రేషన్ లేదా ధరఖాస్తు చేసుకొనే సమయంలో అభ్యర్ధులు నమోదు చేసిన డేటాను సవరించుకొనే వీలు లేదు. ఒక్కసారి ధరఖాస్తు లేదా రిజిస్ట్రేషన్ చేసుకొనే సమయంలో తప్పుడు సమాచారం నమోదు చేస్తే ఈ సమాచారాన్ని అప్ డేట్ చేసే వీలు లేదు.తప్పుడు వివరాలు నమోదు చేస్తే సంబంధిత అభ్యర్ధి ధరఖాస్తును తిరస్కరిస్తారు.

తెలంగాణ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల కోసం పోటీపడే ఇతర రాష్ట్రాల అభ్యర్ధులకు కూడా పోలీస్ రిక్రూట్ మెంట బోర్డు మార్గదర్శకాలు జారీ చేసింది. ఏ సామాజికవర్గానికి చెందిన వారైనా సరే ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్ధులను OC లుగానే పరిగణించనున్నారు.ఇతర రాష్ట్రాల అభ్యర్ధులకు 5 శాతం Reservation మాత్రమే వర్తించనుంది.

ఈ నెల 2వ తేదీ నుండి పోలీస్ ఉద్యోగాల కోసం ధరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే తొలి రోజే 15 వేల మంది ధరఖాస్తు చేసుకొన్నారు. 2018లో పోలీస్ ఉద్యోగాల కోసం  ఆరు లక్షల మంది ధరఖాస్తు చేసుకొన్నారు.ఒకే అభ్యర్ధి ఎన్ని పోస్టులకైనా ధరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్ఐ నుండి కానిస్టేబుల్ తో పాటు ఏఆర్, సివిల్ తదితర విభాగాల్లో ధరఖాస్తు చేసుకోవచ్చు. ఒకే ఫోన్ నెంబర్ తో ఈ ధరఖాస్తు చేసుకోవచ్చని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ప్రకటించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios