TSLPRB : పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో కానిస్టేబుల్ ఉద్యోగ పరీక్షలకు సంబంధించి ఓ ముఖ్యమైన ప్రకటన వెలువడింది.

TSLPRB : తెలంగాణ పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇప్పటికే ఎస్ఐ, ఏఎస్ఐ ఉద్యోగాల‌కు సంబంధించిన తుది రాత‌ప‌రీక్ష‌ జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కానిస్టేబుల్ పరీక్షల హాల్ టికెట్ల విడుదలకు సంబంధించిన తేదీ వివరాలు వెలువడ్డాయి. ఈ మేరకు తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు( TSLPRB) ప్రకటన విడుదల చేసింది.

 కానిస్టేబుల్ హాల్ టికెట్ల‌ను ఏప్రిల్ 24 తేదీ ఉద‌యం 8 గంట‌లకు విడుదల చేయనున్నట్లు TSLPRB ప్రకటించింది. ఈనెల 28 అర్ధరాత్రి 12 గంటల లోపు అధికార వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. హల్ టిక్కెట్ డౌన్ లోడ్ సమయంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తినట్లయితే support@tslprb.in కు మెయిల్‌ లేదా 9393711110, 9391005006 నంబర్లలో సంప్రదించాలని రిక్రూట్ మెంట్ బోర్డు పేర్కొంది.

కానిస్టేబుల్ ఉద్యోగ తుది రాత‌ప‌రీక్ష‌ ఏప్రిల్ 30వ తేదీన‌ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. సివిల్ ఉద్యోగాల‌కు ఉద‌యం 10 నుంచి మ‌ధ్యాహ్నం 1 గంటల వరకు, ఐటీ అండ్ సీవో పరీక్ష మ‌ధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష‌లను నిర్వహించనున్నారు. https://www.tslprb.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి హాల్ టికెట్లతో పాటు ఇతర అప్డేట్స్ పొందవచ్చు.