Asianet News TeluguAsianet News Telugu

ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాల విడుద‌ల‌.. ఇలా చెక్‌ చేసుకోండి..

తెలంగాణ  ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. బోర్డు కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ మంగళవారం ఉదయం విడుదల చేశారు. 

TSBIE Inter 2022 Supplementary Result Declared
Author
First Published Aug 30, 2022, 12:00 PM IST

తెలంగాణ ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్‌ బోర్డ్‌ సెక్రటీర సయ్యద్ ఒమర్ జలీల్‌ మంగళవారం ఉద‌యం ఫలితాలను ప్ర‌క‌టించారు. ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 1,14,289 మంది హాజరుకాగా.. 48,816 మంది విద్యార్థులు పాస్‌ అయ్యారు. 

ఇందులో జనరల్ పాస్ పర్సంటేజ్ 47.74 శాతంగా నమోదైంది.  ఒకేషన్‌లో 12,053 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వగా.. ఇందులో 7,843 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం  65.07గా నమోదైంది. దీంతో ఈ ఏడాది ఇంటర్‌ మెయిన్‌, సప్లీలో కలిసి మొత్తం 80.80 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవ‌చ్చ‌ని అధికారులు తెలిపారు . 

ఇదే స‌మయంలో సెప్టెంబర్‌ 5 నుంచి 8 వరకు రీకౌంటింగ్‌కు చేసుకోవ‌డానికి ఇంటర్‌ బోర్డు అవకాశం కల్పించింది. మరో వైపు మంగళవారం సాయంత్రం ఇంటర్‌ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేయనున్నారు.
 
విద్యార్థులు త‌మ‌ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ results.cgg.gov.in లో చెక్‌ చేసుకోవచ్చు. అలాగే.. మార్క్ షీట్స్, స్కోర్‌కార్డులను అధికారిక‌ వెబ్‌సైట్ నుండి హాల్ టిక్కెట్ నంబర్‌లతో లాగిన్ అయి.. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.  ఈ సప్లిమెంటరీ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. ఎంసెట్ కౌన్సిలింగ్ ఉన్నందున విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు సప్లిమెంటరీ ఫలితాలను ముందుగానే ప్రకటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios