Asianet News TeluguAsianet News Telugu

సంక్రాంతి పండుగ వేళ.. టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్.. 4,233 ప్రత్యేక బస్సులు

సంక్రాంతి ప్రయాణీకులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పండుగ వేళ 4,233 ప్రత్యేక బస్సులను నడపనుంది. 60 రోజుల ముందే రిజర్వేషన్ చేసుకునే సౌలభ్యాన్నీ అందిస్తోంది. 

TS RTC to run more than 4,000 special buses for Sankranti festival
Author
First Published Dec 10, 2022, 11:47 AM IST

హైదరాబాద్ : సంక్రాంతి వచ్చిందంటే చాలు హైదరాబాద్ ఖాళీ అయిపోతుంది. ఇక్కడ ఉద్యోగాలు చేసేవారు పండుగ వేళ నాలుగైదు రోజులు సెలవులు పెట్టుుని మరీ తమ స్వగ్రామాలకు.. వెడుతుంటారు. దీనికి తోడు స్కూల్స్ సెలవులు ఉండడం మరింత కలిసి వస్తుంది. దీంతో ఒక్కసారిగా నగరం ఖాళీ అవుతుంది. అయితే.. సంక్రాంతికి సొంత ఊరుకు ముఖ్యంగా ఆంధ్రాకు వెళ్లేవారు ట్రైన్ రిజర్వేజన్లు, తత్కాల్ టికెట్లు, బస్సుల రద్దీతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. దీన్నినివారించడానికి టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. 

సంక్రాంతి ప్రయాణికుల కోసం ప్రయాణికులకు 4,233 ప్రత్యేక బస్సులు నడపనుంది. ఈ ప్రత్యేక బస్సులు జనవరి 7 నుంచి 15 వరకు అందుబాటులోకి వస్తాయి. అంతేకాదు 60 రోజుల ముందుగానే రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నారు. ఈ ప్రత్యేక బస్సులు అమలాపురం, విశాఖ సహా పలు ప్రాంతాలకు,  తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు ట్రిప్పులు వేయనున్నాయి.

తెలంగాణలో 'ఆమె' కు రక్షణ లేదా.. ? ఏడాదికేడాది పెరుగుతున్న లైంగిక నేరాలు

సంక్రాంతి పండుగ ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పండుగ రద్దీ వేళ ప్రయాణికుల తిప్పలు తగ్గించేందుకు ఏకంగా 4,233 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. నిరుడు 3,736 బస్సులు ఏర్పాటు చేయగా, ఈసారి పది శాతం అదనంగా బస్సులు ఏర్పాటు చేయడం గమనార్హం. అంతేకాదు, వీటిలో 585 బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తుండగా, 60 రోజుల ముందుగానే రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. 

గతంలో ఈ రిజర్వేషన్ సదుపాయం నెల రోజుల ముందు మాత్రమే ఉండేది. వచ్చే ఏడాది జూన్ నెలాఖరు వరకు రిజర్వేషన్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. జనవరి 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో 125 అమలాపురానికి, 117 బస్సులు కాకినాడకు, 83 బస్సులు కందుకూరుకు, 65 విశాఖపట్టణానికి, 51 పోలవరానికి, 40 రాజమహేంద్రవరానికి నడుపుతున్నట్టు పేర్కొన్నారు. అలాగే, తెలంగాణలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలకు కూడా ప్రత్యేక బస్సులు నడుస్తాయని సజ్జనార్ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios