Asianet News TeluguAsianet News Telugu

మొక్కజొన్నకు క్వింటాల్‌కి రూ. 1850 మద్దతు ధర, ప్రభుత్వమే కొనుగోలు: కేసీఆర్

 వరి ధాన్యం కొనుగోలు కోసం గ్రామాల్లో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర చెల్లించి మొక్కజొన్న కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. 

TS govt to procure entire yield of maize at MSP: CM KCR lns
Author
Hyderabad, First Published Oct 23, 2020, 5:44 PM IST

హైదరాబాద్: వరి ధాన్యం కొనుగోలు కోసం గ్రామాల్లో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర చెల్లించి మొక్కజొన్న కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. 

క్వింటాల్ కు రూ.1,850 మద్దతు ధర చెల్లించి మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామన్నారు. రైతులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. మొక్కజొన్నకు  మద్దతు ధర వచ్చే అవకాశం లేనందున వర్షాకాలంలో రైతులు మక్కలు సాగు చేయవద్దని ప్రభుత్వం కోరింది.

 రైతులు మొక్కలు సాగు చేశారని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.  వాస్తవానికి ప్రభుత్వానికి మొక్కలు కొనుగోలు చేసే బాధ్యత లేదన్నారు. అయినప్పటికీ రైతులు నష్టపోవద్దనే ఏకైక కారణంతో ప్రభుత్వం నష్టాన్ని భరించడానికి సిద్ధపడి మొక్కలు కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు కేసీఆర్ వెల్లడించారు. 

గత యాసంగిలో మార్క్ ఫెడ్ 9 లక్షల టన్నుల మొక్కలను మార్క్ ఫెడ్ ద్వారా ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దీనికోసం రూ. 1668 కోట్లు ఖర్చు చేసిందన్నారు.  బయట మార్కెట్లో మొక్కజొన్నకు ధర లేకపోవడం వల్ల వేలం వేయాల్సి వచ్చిందన్నారు.

దీనివల్ల కేవలం రూ. 823 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయన్నారు. మార్క్ ఫెడ్ కు మొత్తంగా 845 కోట్ల నష్టం వచ్చిందని ఆయన తెలిపారు. క్వింటాల్ కు రూ.1,760 చొప్పున ధర చెల్లించి మార్క్ ఫెడ్ మొక్కలను కొనుగోలు చేసిందని చెప్పారు. 

సేకరణ, రవాణా తదితర ఖర్చులన్నీ కలిపి క్వింటాళుకు రెండు వేల రూపాయలు ఖర్చు అయింది. కానీ వేలంలో వచ్చింది క్వింటాళుకు కేవలం 1,150 రూపాయలు మాత్రమే వచ్చాయన్నారు. క్వింటాల్ కు 850 రూపాయల నష్టం వచ్చిన విషయాన్ని ఆయన తెలిపారు. మక్కలకు దేశ వ్యాప్తంగా మార్కెట్ లేకపోవడం వల్ల తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుందని సిఎం వివరించారు.

నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, మహబూబాబాద్ తదితర జిల్లాల్లో పసుపుకు అంతర పంటగా కొద్ది పాటి ఎకరాల్లో మొక్కజొన్న వేసుకోవాలని సూచించింది. ప్రభుత్వ విజ్ఞప్తిని వ్యవసాయాధికారుల సూచనలు పాటించకుండా కొంత మంది రైతులు మక్కలు సాగు చేశారు.

రైతులను సమన్వయ పరిచి దేశంలోనే మొదటి సారిగా నిర్ణీత పంటల సాగు విధానం అమలు అవుతుందన్నారు. ఎవరూ అడగక ముందే ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుల భూమలు వద్ద లక్ష కల్లాల నిర్మాణం చేపట్టింది. 

2,600 రైతు వేదికలను నిర్మిస్తుందని చెప్పారు. ఇన్ని పనులు చేసిన ప్రభుత్వం రైతులు నష్టపోతుంటే చూస్తూ ఉండలేక మొక్కజొన్న కొనుగోలు చేయాలని నిర్ణయించిందని సీఎం తెలిపారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios