Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల:95.16 శాతం ఉత్తీర్ణత

తెలంగాణ ఈసెట్ ఫలితాల విడుదలను తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మెన్  పాపిరెడ్డి బుధవారం నాడు విడుదల చేశారు.ఈ పరీక్షల్లో 95.16 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఈ నెల 3న జరిగిన ఈసెట్‌కు 24 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. 

TS ECET Result 2021 declared
Author
Hyderabad, First Published Aug 18, 2021, 1:18 PM IST


హైదరాబాద్:  తెలంగాణ ఈసెట్ ఫలితాలను తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మెన్ పాపిరెడ్డి బుధవారం నాడు విడుదల చేశారు.ఈ పరీక్షల్లో 95.16 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఈ నెల 3న జరిగిన ఈసెట్‌కు 24 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ నెల 24 నుండి ఈసెట్ ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నారు.  ఈ నెల 24 నుండి 28 వరకు స్లాట్ బుకింగ్,చ 26 నుండి 29 వరకు అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన జరగనుంది.

ఈ నెల 26 నుండి 31 వరకు అభ్యర్థులు వెబ్ ఆఫ్షన్లు ఇవ్వాలి. సెప్టెంబర్ 2న అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తారు.సెప్టెంబర్ 2 నుండి ఏడు వరకు ఆన్‌లైన్ లో అభ్యర్ధులు సెల్ప్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు.

సెప్టెంబర్ 13న  తుది విడత ప్రవేశాల షెడ్యూల్ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 14న ధృవపత్రాల పరిశీలన జరగనుంది.సెప్టెంబర్ 17న తుది విడత ఈసెట్ సీట్లను కేటాయిస్తారుపాలిటెక్నిక్ చదివిన విద్యార్థులు ఇంజనీరింగ్, బీ పార్మసీ రెండో సంవత్సరంలో చేరేందుకు ఈసెట్ పరీక్షలు నిర్వహిస్తారు.

Follow Us:
Download App:
  • android
  • ios