తెలంగాణ ఎంసెట్ రెండో విడత కౌన్సిలింగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఈరోజు టీఎస్ ఎంసెట్- 2022 కౌన్సెలింగ్ ఫేజ్ 2 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించనుంది. 

తెలంగాణ ఎంసెట్ రెండో విడత కౌన్సిలింగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఈరోజు టీఎస్ ఎంసెట్- 2022 కౌన్సెలింగ్ ఫేజ్ 2 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించనుంది. విద్యార్థులు.. అధికారిక వెబ్‌సైట్ https://tseamcet.nic.in/ను సందర్శించడం ద్వారా కౌన్సిలింగ్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఎంసెట్ తొలి విడత కౌన్సిలింగ్ ఇప్పటికే పూర్తికాగా.. సెప్టెంబర్ 28 నుంచి రెండో విడత కౌన్సిలింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల విషయంలో ప్రతిష్టంభన ఏర్పడటంతో ఎంసెట్ రెండో విడత కౌన్సిలింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ క్రమంలోనే నేటి నుంచి ఎంసెట్ రెండో విడత కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. 

ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ ఎలా నమోదు చేసుకోవాలి
-అధికారిక వెబ్‌సైట్‌ tseamcet.nic.in ను సందర్శించాలి. 
-హోమ్ పేజీలో లాగిన్ కోసం లింక్‌పై క్లిక్ చేయండి.
-లాగిన్ కోసం అవసరమైన వివరాలను ఎంటర్ చేయాలి. అనంతరం అప్లికేషన్ ఫామ్‌లో అవసరమైన సమాచారాన్ని నింపాల్సి ఉంటుంది. 
-అన్ని వివరాలను మళ్లీ చెక్ చేసుకుని.. అప్లికేషన్ ఫామ్‌ను సబ్మిట్ చేయాలి.
-భవిష్యత్తు అవసరం దృష్ట్యా ఆ దరఖాస్తు ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసి, సేవ్ చేసుకోవాలి. 

రిజిస్ట్రేషన్ తర్వాత.. స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అక్టోబర్ 12న జరుగుతుంది. అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 13 వరకు ఆప్షన్ల నమోదు ప్రక్రియ జరగనుంది. అక్టోబర్ 13న ఆప్షన్‌లను ఫ్రీజ్ చేయనున్నారు. అక్టోబర్ 16 సీట్ల కేటాయింపు జరుగుతుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లింపు, స్వీయ రిపోర్టింగ్‌ను పూర్తి చేయడానికి అక్టోబర్ 18 వరకు సమయం ఉంటుంది.

ఈ ఏడాది ఇంజినీరింగ్ విభాగంలో పోలు లక్ష్మి సాయి లోహిత్ రెడ్డి మొదటి ర్యాంక్ సాధించగా, నక్కా సాయి దీప్తిక, పోలిశెట్టి కార్తికేయ తర్వాతి స్థానాల్లో నిలిచారు. అగ్రికల్చర్ పరీక్షలో నేహా మొదటి ర్యాంక్ సాధించగా, రోహిత్, త్రుణ్ కుమార్ తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇంజినీరింగ్ విభాగంలో 80.41 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించగా, వ్యవసాయ అభ్యర్థులు మొత్తం 88.34 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక, ఈసారి మూడు విడతల్లో ఇంజినీరింగ్‌ ప్రవేశాల ప్రక్రియ పూర్తిచేయనున్నట్టు తెలంగాణ ఉన్నత విద్యా మండలి తెలిపింది. మొదటి దశ కౌన్సెలింగ్ లో విద్యార్థులు ఎక్కువగా కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత కోర్సుల కోసం ఎక్కువ ఎంపిక చేసుకున్నారు.