తెలంగాణలో గత ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. మరో రెండు, మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.  ఈ నేపథ్యంలో TS Eamcet 2022 పరీక్షకు సంబంధించి ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. 

తెలంగాణలో గత ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈరోజు (జూలై 13) జరగాల్సిన ఈ-సెట్ పరీక్ష వాయిదాను వాయిదా వేస్తూ ఉన్నత విద్యామండలి రెండు రోజుల క్రితం నిర్ణయం తీసుకుంది. అయితే రేపటి (జూలై 14) నుంచి ప్రారంభం కానున్న ఎంసెట్ ఎగ్జాట్ మాత్రం షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని వెల్లడించింది. అయితే రాష్ట్రంలో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. మరో రెండు, మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

భారీ వర్షాల నేపథ్యంలో పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. కొన్నిచోట్ల రహదారులు తెగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో బుధ, గురు వారాల్లో కూడా వర్షాలు కురిస్తే విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవడం ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎంసెట్ ఎగ్జామ్‌ను షెడ్యూల్‌ ప్రకారం నిర్వహిస్తారా అనే దానిపై సందిగ్దత నెలకొంది. 

ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షను వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించింది. అయితే ఎంసెట్ ఇంజనీరింగ్‌ పరీక్ష మాత్రం షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని వెల్లడించింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి ఒక ప్రటన విడదల చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అగ్రికల్చర్ పరీక్షను మాత్రమే వాయిదా వేస్తున్నట్టుగా చెప్పారు. 

జూలై 14,15 తేదీల్లో జరగాల్సి ఉన్న ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షను వాయిదా వేస్తున్నట్టుగా వెల్లడించారు. ఈ పరీక్ష నిర్వాహణకు సంబంధించిన కొత్త తేదీని త్వరలోనే వెల్లడించనున్నట్టుగా చెప్పారు. అయితే జూలై 18,19,20 తేదీల్లో జరగనున్న ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష యథావిథిగా కొనసాగనుందని తెలిపారు.