తెలంగాణ భవన్ లో ప్రారంభమైన టీఆర్ఎస్‌ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గం:కీలకాంశాలపై చర్చ
టీఆర్ఎస్ శాసనసభపక్షం,టీఆర్ఎస్ రాష్ట్రకార్యవర్గం తెలంగాణభవన్ లో ఇవాళ మధ్యాహ్నం ప్రారంభమైంది. పలు కీలకాంశాలపై ఈసమావేశంలో చర్చించనున్నారు.
హైదరాబద్:టీఆర్ఎస్ శాసనససభపక్షం,టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం మంగళవారంనాడు తెలంగాణ భవన్ లో ప్రారంభమైంది.మునుగోడులో పనిచేసిన నేతలకు ఈ సమావేశం అభినందిస్తూ తీర్మానం చేయనుంది.ఈడీ,కేంద్ర దర్యాప్తుసంస్థల వైఖరిపై నిరసన కార్యక్రమాల గురించి సమావేశంలో చర్చించనున్నారు.బీఆర్ఎస్ కమిటీలను నియమించనున్నారు..టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ ఈ ఏడాది అక్టోబర్ 5న నిర్వహించిన సమావేశంలో తీర్మానం చేశారు.ఈ తీర్మానం కోసం సమావేశం నిర్వహించిన తర్వాత ఇవాళ సమావేశం నిర్వహిస్తున్నారు.
మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలతో పాటు రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై కేసీఆర్ పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేసే అవకాశం ఉంది.మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది.ఈ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు టీఆర్ఎస్ కు మద్దతును ప్రకటించాయి. రానున్నరోజుల్లో టీఆర్ఎస్,లెఫ్ట్ పార్టీల మధ్య పొత్తు ఉండే అవకాశాలుకన్పిస్తున్నాయి. రానున్న రోజుల్లో రాజకీయ పరిణామాలపై కేసీఆర్ వివరించే అవకాశం లేకపోలేదు.
దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు.ఈ మేరకు ఆయా రాష్ట్రాల్లో పనిచేసేందుకు పార్టీ నేతలను కోఆర్డినేటర్లను నియమించనున్నారు. మరోవైపు దేశంలోని పలు రాష్ట్రాల్లో సభలునిర్వహించాలనిపార్టీ భావిస్తుంది. ఈ విషయాలపై కూడా కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది.ఢిల్లీ, ఏపీ లలో సభలు నిర్వహించాలని కేసీఆర్ గతంలో నిర్ణయించారు.సభలు నిర్వహిస్తారా ,లేదా ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తారా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.