Asianet News TeluguAsianet News Telugu

మాకు ఆ అర్హత లేదా: కేంద్రబడ్జెట్ పై కేటీఆర్ ట్వీట్

తెలంగాణ రాష్ట్రానికి కొత్త రైల్వే సర్వీసులు లేవని, కొత్త రైల్వే లైన్ ప్రకటించలేదని, కొత్త రైల్వే లైన్ కోసం సర్వే ప్రతిపాదనలు కూడా లేవని మండిపడ్డారు. బుల్లెట్ రైల్, హైస్పీడ్ రైల్ వంటి వాటిని బడ్జెట్ లో పొందుపరచలేదన్నారు. దక్షిణ భారతదేశానికి బుల్లెట్ రైల్, హైస్పీడ్ రైలు పొందే అర్హత లేదా అని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా నిలదీశారు. 

trs working president ktr tweets on  south of India is undeserving of Bullet Rail & Hi-speed Rail
Author
Hyderabad, First Published Jul 11, 2019, 12:44 PM IST

హైదరాబాద్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామాన్ ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ పై మరోసారి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేంద్ర బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఆరోపించారు. 

తెలంగాణ రాష్ట్రానికి కొత్త రైల్వే సర్వీసులు లేవని, కొత్త రైల్వే లైన్ ప్రకటించలేదని, కొత్త రైల్వే లైన్ కోసం సర్వే ప్రతిపాదనలు కూడా లేవని మండిపడ్డారు. బుల్లెట్ రైల్, హైస్పీడ్ రైల్ వంటి వాటిని బడ్జెట్ లో పొందుపరచలేదన్నారు. దక్షిణ భారతదేశానికి బుల్లెట్ రైల్, హైస్పీడ్ రైలు పొందే అర్హత లేదా అని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా నిలదీశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios