హైదరాబాద్: ఏప్రిల్ 11వ తేదీ తర్వాత చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఏమిటో తెలుస్తోందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయపడ్డారు. 

సోమవారం నాడు రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్‌లో చేరారు.  ఈ సందర్భంగా హైద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన  ఓ కార్యక్రమంలో ఆయన  మాట్లాడారు. 

చంద్రబాబును ఇంటికి పంపించేందుకు ఏపీ ప్రజలు సిద్దంగా ఉన్నారని కేటీఆర్ అభిప్రాయపడ్డారు మహారాష్ట్ర ఎన్నికలపై ఏ రకమైన ఆసక్తితో ప్రజలు ఉన్నారో, ఏపీలో కూడ ఎన్నికలపై ప్రజలు ఆసక్తిని చూపిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

తన వద్ద కేసీఆర్ పనిచేశాడని చంద్రబాబునాయుడు చెప్పడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. మంత్రులంటే బానిసలు కాదన్నారు.చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వద్ద మంత్రిగా పనిచేయలేదా అని కేటీఆర్ ప్రశ్నించారు.టీడీపీని చంద్రబాబునాయుడు స్థాపించినట్టుగా  మాట్లాడడం సరైందికాదన్నారు. 
టీఆర్ఎస్‌ జాతీయ పార్టీ పెడితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు పచ్చి అవకాశవాది అని కేటీఆర్ విమర్శించారు.