టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి నెటిజన్ల మనసు చాటుకున్నారు. ఎవరికి ఎలాంటి సహాయం  చేయాలన్నా కేటీఆర్ త్వరగా స్పందిస్తూ ఉంటారు. తాజాగా... ఓ జవాను కూమార్తెకు కేటీఆర్ సహాయం చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.

ఆర్మీ అధికారి వీరభద్రాచారి కుమార్తెకు ఏవియేషన్ అకాడెమీలో సీటు లభించింది. ఆమె చదువుకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆర్థిక చేయూతను తన స్నేహితుడి ద్వారా అందించానని కేటీఆర్ ట్వీట్ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి దీనికన్నా మంచి విషయం ఏముంటుందని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రచారానికి ఇష్టపడని కారణంగా తన స్నేహితుడి పేరును కేటీఆర్ వెల్లడించలేదు.