హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేతలపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎల్పీ విలీనం, పార్టీ ఫిరాయింపులపై టీడీపీ నేతలు మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పార్టీ ఫిరాయింపులపై మాట్లాడటానికి టీడీపీ నేతలకు సిగ్గుండాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి లాక్కోలేదా అని నిలదీశారు. 

23 మంది ఎమ్మెల్యేలను ఇతర పార్టీల నుంచి కొనుగోలు చేసింది టీడీపీ అయితే తమపై విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. మీరు చేస్తే న్యాయం తాము చేస్తే అధర్మమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిరాయింపులకు పాల్పడింది మీరు కాదా అని టీడీపీని కడిగి పారేశారు. సీఎల్పీ విలీనంపై మాట్లాడే అర్హత టీడీపీకి లేదని కేటీఆర్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. 

ఈ వార్తలు కూడా చదవండి

కాంగ్రెస్ తో పోల్చుకుంటే మర్యాదగానే చేశాం: సీఎల్పీ విలీనంపై కేటీఆర్ కామెంట్స్