పాలమూరు నుంచి ఎంపీగా పోటీ చేయడానికి డీకే అరుణ ససేమిరా అన్నారన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నాగర్‌కర్నూలులో జరిగిన బహిరంగసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

గతంలో పాలమూరు లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్‌లో విపరీతమైన పోటీ ఉండేదన్నారు. కానీ ఇప్పుడు అభ్యర్థులు కరువయ్యారని కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దాదాపు 70 నుంచి 80 పార్లమెంట్ ఫెడరల్ స్ధానాలు సాధిస్తే.. ఢిల్లీ గద్దెపై ఎవరిని కూర్చోబెట్టాలో మనమే నిర్ణయిస్తామన్నారు.

దక్షిణాదిలో ఉనికే లేని బీజేపీ జాతీయ పార్టీ ఎలా అవుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. నాగర్‌కర్నూల్‌లో గులాబీ జెండా ఎగురవేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. అందరిని కలుపుకుని ముందుకు వెళ్లాలని, ఎవరైనా కొత్త వారు పార్టీలో చేరితే చేర్చుకోవాలన్నారు.