హైదరాబాద్: తెలంగాణ లోక్ సభ ఎన్నికల తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో విచిత్రమైన ట్రెండింగ్ కనిపించిందని అభిప్రాయపడ్డారు. 

మల్కాజ్ గిరిలో వెంట్రెకవాసితో కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు. ఆదిలాబాద్ లో బీజేపీ గెలుస్తోందని ఆ పార్టీ కూడా ఊహించలేదు. మోదీ హవాతోనే బీజేపీకి ఓట్లు పడ్డాయని ఆయన అభిప్రాయపడ్డారు. సీట్లు పోయినా టీఆర్ఎస్ పార్టీకి ఓట్ల శాతం పెరిగిందన్నారు. 

ఈ ఫలితాలు టీఆర్ఎస్ పార్టీకి తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ లాంటివని ఆయన స్పష్టం చేశారు. తన సోదరి కవిత ఓటమిపై కేసీఆర్ స్పందించారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు ఒక్కటయ్యాయని చెప్పుకొచ్చారు. 

నిజామాబాద్ లో నామినేషన్ వేసింది రైతులు కాదని నేతలేనని స్పష్టం చేశారు. కవిత డాటర్ ఆఫ్ ఫైటర్ అని గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. నిరంతరం కవిత ప్రజల మధ్యనే ఉంటుందని తెలిపారు. 

దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. కేంద్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించేది ప్రాంతీయ పార్టీలేనని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ గా తాను ఫెయిల్ కాలేదన్నారు.