Asianet News TeluguAsianet News Telugu

తుంగతుర్తి ఎమ్మెల్యే కిషోర్‌పై విమర్శలు: నగేష్ పై టీఆర్ఎస్ శ్రేణుల దాడి

తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ను విమర్శిస్తూ సెల్ఫీ వీడియో పోస్టు చేసిన విద్యార్థి నేత నగేష్ పై టీఆర్ఎస్  కార్యకర్తలు సోమవారం నాడు దాడికి దిగారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ఎమ్మెల్యే కిషోర్ కుమార్  విమర్శించడాన్ని విద్యార్ధి నేత నగేష్ తప్పుబట్టారు.

TRS workers attacked on student wing leader Nagesh in Suryapet district
Author
Tungaturthi, First Published Aug 16, 2021, 3:05 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

తుంగతుర్తి: తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ పై  సెల్పీ వీడియో పోస్టు చేసిన విద్యార్థి నేత నగేష్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు  దాడికి దిగారు.   ఉద్యోగానికి రాజీనామా చేసి ఇటీవలనే  బీఎస్పీలో చేరిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  పై తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ పై  విద్యార్ధి నేత నగేష్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ఎమ్మెల్యే కిషోర్ కుమార్ విమర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ విషయమై ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కూడ నగేష్  ఆ వీడియోలో డిమాండ్ చేశారు. 

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై ఎమ్మెల్యే కిషోర్ చేసిన విమర్శలను నిరసిస్తూ ఇవాళ అంబేద్కర్ విగ్రహనికి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన విద్యార్ధి నగేష్ పై నాగారం మండంల పస్తాల గ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగారు. నగేష్ ప్రయాణీస్తున్న కారుపై కూడ దాడి చేశారు.ఈ దాడిలో నగేష్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. నగేష్ కు కూడ గాయాలయ్యాయి.

బీఎస్పీలో చేరిన సమయంలో  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు.ఈ విమర్శలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పందించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే కిషోర్ కుమార్ సహా పలువురు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఈ విషయమై స్పందించారు. అయితే తుంగతుర్తి ఎమ్మెల్యే కిషోర్ కుమార్ కి ఫోన్‌లో ప్రవీణ్ కుమార్ ను విమర్శించడాన్ని  ఓ వ్యక్తి ప్రశ్నించారు. ఆ తర్వాత నగేష్  సోషల్ మీడియాలో పోస్టు చేశారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios