తెలంగాణ సర్కారును తన పదునైన మాటలు, తిట్ల పురాణంతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై ఐటి మంత్రి కేటిఆర్ ఆచితూచి మాట్లాడు. జపాన్, కొరియా, దావోస్ పర్యనటకు వెళ్తున్న సందర్భంగా కేటిఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అంశం ప్రస్తావనకు వచ్చింది. దీంతో కేటిఆర్ ఆచితూచి మాట్లాడారు. రేవంత్ పేరు తీసుకోకుండా పరోక్షంగా కామెంట్స్ చేశారు.

విపక్షాలకు పనిలేకనే పసలేని ఆరోపణలు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదనీ.. అందుకే 24గంటల కరెంటుపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. జైలులో చిప్పకూడ తిన్నవారు కూడా ఇపుడు నీతులు చెప్తున్నారని సెటైర్లు వేశారు కేటీఆర్. ఈ నెలలో పంచాయితీ రాజ్ చట్టంపై ప్రత్యేక సమావేశాలు ఉండొచ్చని సూచనప్రాయంగా చెప్పారు కేటీఆర్.

కాంగ్రెస్ వాళ్ళు ప్రజలను, రైతలును కాల్చుకు తింటే మేము కరెంట్ ఇచ్చి అదుకుంటున్నామన్మునారు. అవినీతి జరిగిందని  ఆరోపించే వారు..అధారాలుంటే భయటపెట్టోచ్చు కదా అని ప్రశ్నించారు. న్యాయ స్ధానాలకి వెళ్ళోచ్చు కదా అన్నారు. చిప్ప కూడు తిని వచ్చిన వాళ్ళు అడిగితే కూడా సమాధానం చెప్పాలా? అని ప్రశ్నించారు. అసేంభ్లీలో మాట్లాడకుండా పారిపోతారు మల్ల తిరిగి బయట మాత్రం చర్చించాలని డిమాండ్ చేస్తారు ఎందకో అని ప్రశ్నించారు. తెలంగాణ కష్టాల్లో ఉన్నప్పుడు ఎపి ప్రభుత్వం విధ్యుత్ ఇవ్వలేదన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఇస్తమని ముందుకు రావడం విడ్డూరంగా ఉందన్నారు.

కేంద్రం  ముందస్తు కి పోయే ధైర్యం చేస్తుందా ? అన్నది చూడాలన్నారు. డీలిమిటేషన్ జరిగే అవకాశం ఉందని సూచనప్రాయంగా చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన మేము రెడీ అని ధీమా వ్యక్తం చేశారు.