హైదరాబాద్: రెండో విడత గ్రామపంచాయితీ ఎన్నికల్లో  టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థుల హవా కొనసాగుతోంది. శుక్రవారం నాడు 3342 సర్పంచ్‌ పదవులు, వాటి పరిధిలోని 26,191 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు నిర్వహించారు.

ఇవాళ ఉదయం ఏడు గంటల నుండి  మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో  88.26 శాతం పోలింగ్ శాతం నమోదైంది. మధ్యాహ్నం రెండు గంటల నుండి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

గ్రామ పంచాయితీ ఎన్నికల్లో శుక్రవారం సాయంత్రానికి అందిన సమాచారం మేరకు టీఆర్ఎస్ బలపర్చిన  అభ్యర్థులు విజయం సాధించారు.


టీఆర్ఎస్- 1837

కాంగ్రెస్   475

టీడీపీ   20

బీజేపీ  17

సీపీఐ  03

సీపీఎం 13