Asianet News TeluguAsianet News Telugu

జెడ్పీ పీఠాలన్నీ టీఆర్ఎస్ పార్టీవే: కారు హవా ముందు డీలాపడ్డ కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లాలో కూడా తన ఉనికిని చాటుకోలేకపోయింది. ఎక్కడా కూడా జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. 
జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు కాస్త బెటర్ అని చెప్పుకోవాలి. 

TRS victory in the zptc polls
Author
Hyderabad, First Published Jun 4, 2019, 6:35 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం ఎదురైంది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మూడు స్థానాల్లో విజయం సాధించి విజయోత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. 

కాంగ్రెస్ పార్టీకి  రాష్ట్రంలోని 32 జిల్లాలలో ఎక్కడా జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. 538 స్థానాలకు గానూ కాంగ్రెస్ పార్టీ కేవలం 62స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యింది. ఏ ఒక్క జిల్లాలోనూ పూర్తి ఆధిపత్యం కొనసాగించలేకపోయింది. 

కనీసం పోటీ సైతం ఇవ్వలేకపోయింది. 32 జిల్లాలలో కారు జోరు ముందు హస్తం డీలా పడిపోయింది. ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ 398 జెడ్పీటీసీలను కైవసం చేసుకుంది. దీంతో ఏ జిల్లాలోనూ జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఎదురైంది. 

ఇకపోతే కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాలలో మాత్రం కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని చాటుకుంది. కామారెడ్డి జిల్లాలో 8 జెడ్పీటీసీలు, సంగారెడ్డిలో 4 జెడ్పీటీసీ స్థానాలను మాత్రమే కైవసం చేసుకుని కాస్త గట్టి పోటీ ఇచ్చింది.  

కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లాలో కూడా తన ఉనికిని చాటుకోలేకపోయింది. ఎక్కడా కూడా జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. 
జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు కాస్త బెటర్ అని చెప్పుకోవాలి. ఎంపీటీసీల విషయానికి వస్తే టీఆర్ఎస్ పార్టీ 3,545 స్థానాల్లో విజయం సాధించగా కాంగ్రెస్ పార్టీ 1,373, బీజేపీ 209, ఇతరులు 591 స్థానాలను కైవసం చేసుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios