హైదరాబాద్: టీఆర్ ఎస్ పార్టీలో మిగిలిన 14 మంది అభ్యర్థుల జాబితా ఆదివారం ప్రకటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. తెలంగాణ భవన్‌లో ఆదివారం టీఆర్ఎస్ అభ్యర్థులతో సమావేశం అనంతరం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతోపాటు కేసీఆర్ తదుపరి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.  

ఈ ఏడాది సెప్టెంబర్ 6న కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేశారు. అనంతరం ఆరోజు సాయంత్రం తెలంగాణ భవన్ లో ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించారు. ప్రకటించిన వెంటనే అభ్యర్థులంతా ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. అంతేకాదు అసంతృప్తులను బుజ్జగించే బాధ్యత కూడా ఆయా అభ్యర్థులకే వదిలేశారు. 

అభ్యర్థుల ప్రచారంపై టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ డేగకన్ను వేశారు. ఎప్పకప్పుడు ప్రచారంపై నివేదికలు తెప్పించుకుంటున్నారు. మధ్యలో అభ్యర్థులకు సెల్ ఫోన్లో పలు సూచనలు సలహాలు కూడా ఇస్తున్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మిగిలిన అభ్యర్థులను కూడా ప్రకటించి ప్రచారంలో వేగవంతం పెంచేలా దిశానిర్దేశం చేస్తారని సమాచారం. 

ఈ వార్తలు కూడా చదవండి

టీఆర్ఎస్ రెండో జాబితా: ఖరారైన అభ్యర్థులు వీళ్లే..?