జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థుల కసరత్తు ముమ్మరం చేస్తోంది. దీనిలో భాగంగా బుధవారం 105 మందితో తొలి జాబితాను విడుదల చేసింది.

తమ పార్టీ తరపున 29 మందితో కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల చేసిన కొద్దిసేపటికే టీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్‌ను విడుదల చేయడం విశేషం. వీరిలో ఎక్కువమంది సిట్టింగ్‌లకు తిరిగి టికెట్ ఇచ్చినట్టు కనిపిస్తోంది.

 

 

 

 

 

ఉప్పల్ నియోజకవర్గంలోని ఏఎస్ రావు నగర్, చర్లపల్లి, మీర్ పేట-హెచ్ బి కాలనీ, మల్లాపూర్, నాచారం, ఉప్పల్, రామంతపూర్, హబ్సిగూడ, చిలుకనగర్ డివిజన్ల అభ్యర్థులను టిఆర్ఎస్ పెండింగ్ లో పెట్టింది.

మరోవైపు జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్‌కు అనుకూల వాతావరణం వుందని కేసీఆర్ చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం ఇప్పటి వరకు 65,000 కోట్లు కేటాయించామని.. ఈ విషయాన్ని టీఆర్ఎస్ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.

భారతీయ రైల్వేలను తెగనమ్మేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేసీఆర్ ఆరోపించారు. రైల్వే స్టేషన్‌లో ఛాయ్ అమ్మానని చెప్పిన ప్రధానే... రైల్వేలను అమ్ముతున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. రైళ్లని ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని సీఎం ప్రశ్నించారు.

అబద్ధాన్ని వందసార్లు చెప్పి  ప్రజలను గోల్‌మాల్ చేసే కార్యక్రమాలు చూస్తున్నామన్నారు. సోషల్ మీడియాను యాంటీ సోషల్ మీడియాగా మార్చి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని కేసీఆర్ ఆరోపించారు.