నాగార్జునసాగర్ లో కరోనా పంజా: టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు పాజిటివ్

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. అదే సమయంలో నాగార్జునసాగర్ లో కోవిడ్ పంజా విసిరింది. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ సోకింది.

TRS Nagarjunasagar assembly seat candidate Nomula Bhagath tested positive for Corona

నాగార్జునసాగర్: తెలంగాణలోని నాగార్జునసాగర్ లో కరోనా పంజా విసిరింది. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారంలోనూ, పోలింగులోనూ కరోనా వైరస్ వ్యాపించినట్లు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి నోముల భగత్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా వైరస్ సోకింది. టీఆర్ఎఎస్ నేత కోటిరెడ్డికి కూడా కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. బిజెపి, కాంగ్రెసులకు చెందిన పలువురు నాయకులకు కూడా కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. 

తెలంగాణలో రాష్ట్రంలో కరోనా వైరస్ నానానిటీకీ విస్తరిస్తోంది. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ గణనీయంగా పెరుగుతున్నాయి. తాజాగా గత 24గంటల్లో (శనివారం రాత్రి 8గంటల నుండి ఆదివారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 83,089మందికి కరోనా టెస్టులు చేయగా 4009మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,55,433కు చేరితే టెస్టుల సంఖ్య 1,18,20,842కు చేరాయి.

ఇక ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్నవారిలో తాజాగా 1878మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 3,14,4413కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 39,154యాక్టివ్ కేసులు వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.  

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో 14 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1838కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.51శాతంగా వుంటే దేశంలో ఇది 1.2శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 86శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 88.46శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే వనపర్తి 39, నాగర్ కర్నూల్ 33, జోగులాంబ గద్వాల 32, కామారెడ్డి 115, ఆదిలాబాద్ 72, భూపాలపల్లి 22, జనగామ 34, జగిత్యాల 175, అసిఫాబాద్ 25, మహబూబ్ నగర్ 129, మహబూబాబాద్ 36, మెదక్ 60, నిర్మల్ 90, నిజామాబాద్ 360,  సిరిసిల్ల 80, వికారాబాద్ 65, వరంగల్ రూరల్ 49,  ములుగు 26, పెద్దపల్లి 39, సిద్దిపేట 125, సూర్యాపేట 69, భువనగిరి 20, మంచిర్యాల 111 నల్గొండ 58 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇక హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో అత్యధికంగా 705కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ 363, రంగారెడ్డి 336, కొత్తగూడెం 49, కరీంనగర్ 135, ఖమ్మం 113, సంగారెడ్డి 264, వరంగల్ అర్బన్ 146కేసులు నమోదయ్యాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios