నిరుద్యోగ సమస్యపై టీఆర్‌ఎస్ లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు (Nama Nageswararao) ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు స్పీకర్ అనుమతి ఇవ్వకపోవడంతో ఆ పార్టీ ఎంపీలు సభలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు.
టీఆర్‌ఎస్ ఎంపీలో లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు. నిరుద్యోగ సమస్యపై టీఆర్‌ఎస్ లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు (Nama Nageswararao) ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు స్పీకర్ అనుమతి ఇవ్వకపోవడంతో టీఆర్‌ఎస్ ఎంపీలో సభలో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం లోక్‌సభ నుంచి టీఆర్‌ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్ ఎంపీ మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగులను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. దేశమంతా నిరుద్యోగ సమస్య ఉందన్నారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేంద్రం స్పందించడం లేదన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలిస్తానని మోదీ చెప్పారని.. కానీ ఉద్యోగా భర్తీ చేపట్టం లేదని విమర్శించారు.
ఎనిమిదేళ్లలో కేంద్రం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో వెల్లడించాలని టీఆర్‌ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. ఉద్యోగాల కల్పనకు కేంద్రానికి చిత్తశుద్ది లేదన్నారు. కేంద్రంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కేంద్రం వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు మాట్లాడుతూ.. ఉద్యోగాల కల్పనపై కేంద్రం మాట్లాడం లేదని అన్నారు. నిరుద్యోగ సమస్యపై తమ ఎంపీలు వాయిదా తీర్మానం ఇస్తే తిరస్కరించారని తెలిపారు.
