అవిశ్వాసం: ఏపిని టార్గెట్ చేసిన టీఆర్ఎస్ ఎంపి వినోద్

TRS MP Vinod speech on parliament
Highlights

పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగుతున్న చర్చలో టీఆర్ఎస్ ఎంపీ వినోద్ ప్రసంగిస్తూ ఏపిని టార్గెట్ చేశారు. ఎన్డీఏలో భాగస్వామ్య పక్షమైన తెలుగుదేశం పార్టీ కోసమే అన్యాయంగా తెలంగాణలోని ఏడు మండలాలను ఏపిలో కలిపారని ఆయన మండిపడ్డారు. ప్రధాని మోదీ స్వయంగా చొరవ తీసుకుని ఈ పని చేయించారని, ఏపీ కోసం తెలంగాణ కు అన్యాయం చేయడం ఏమిటని వినోద్ ప్రశ్నించారు. ఆ ఏడు మండలాలను తిరిగి తెలంగాణలో కలిపేందుకు ఈ పార్లమెంట్ సమావేశంలోనే బిల్లు ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

 అసలే విద్యుత్ కష్టాల్లో ఉన్న సమయంలో సీలేరు హైడల్ ప్రాజెక్టును అన్యాయంగా ఏపీలో కలిపారని మండిపడ్డాడు. కేంద్ర ప్రభుత్వం, ఏపి ప్రభుత్వాలు ఎన్ని అవరోధాలు సృష్టించినా విద్యుత్ కష్టాలను అధిగమించి రైతులకు నిరంతర విద్యుత్ అందుబాటులోకి తెచ్చామని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల సంక్షేమానికి పాటుపడుతున్నామని అన్నారు.

ఇక పోలవరం గురించి మాట్లాడిన వినోద్...ఆ ప్రాజెక్టును తామెప్పుడూ వ్యతిరేకించలేదన్నారు. కానీ నీటి పంపకాలు సవ్యంగా జరపాలని మాత్రమే కోరుతున్నట్లు ఆయన స్పషట్ం చేశారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ప్రకటించాలని ఆయన కోరారు. 

మోదీ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆంకాంక్షను ఆ నాలుగేళ్లలో ఏనాడూ పట్టించుకోలేదని వినోదం మండిపడ్డారు. ప్రజలు కేంద్ర ప్రభుత్వం పై పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలుగానే మిగిలాయని అన్నారు. ప్రజల ఆకాంక్షకు తగ్గట్లు ప్రభుత్వాలు నడుచుకోవాలని ఆయన వినోద్ సూచించారు.

loader