మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలంగాణ ఎన్నికలపై చేసిన సర్వే వట్టి బక్వాస్ అని టీఆర్ఎస్ ఎంపీ  వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఇటీవల లగడపాటి.. తెలంగాణలో స్వంతంత్రులదే పై చేయి అంటూ.. కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ విషయంపై వినోద్ మండిపడ్డారు.  కాంగ్రెస్, టీడీపీకి వారధిగా లగడపాటి పనిచేస్తున్నాడని ఆరోపించారు.

అంనతరం మహాకూటమిపై కూడా విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణను పరోక్షంగా పాలించాలని చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.  ఏపీ సీఎం చంద్రబాబు వెనుకుండి టీ కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నాడని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు చేసిన అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో బలమైన శక్తిగా ఉన్న టీఆర్‌ఎస్‌ను నిర్వీర్యం చేయాలని చంద్రబాబు అనుకుంటున్నాడన్నారు.

తెలంగాణలో కట్టిన ప్రాజెక్టులు చంద్రబాబుకు కనబడుతలేవా? తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్రానికి రాసిన లేఖలు వాపస్ తీసుకుంటావా? అని ప్రశ్నించారు. పరిశ్రమలు ఆంధ్రాకు తరలించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని బలమైన రాజకీయ పార్టీ పరిపాలించొద్దని కుట్రలు చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని ఎంపీ డిమాండ్ చేశారు.