దేశంలో కుల గణన చేయాల్సిన అవసరం ఉందని టీఆర్ఎస్ ఎంపీ కేశవ రావు డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఎంపీలు కుల గణనపై వాయిదా తీర్మాణాలు ఇచ్చారు.
న్యూఢిల్లీ: దేశంలో సామాజిక న్యాయం రావాలంటే కుల గణన చేయాల్సిన అవసరం ఉందని TRS ఎంపీ కేశవరావు అభిప్రాయపడ్డారు.
బుధవారంనాడు న్యూఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీ K. Keshava Rao మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందన్నారు. ప్రతి అంశాన్ని తాము ఫోకస్ చేస్తున్నామన్నారు.. కొన్ని పార్టీలు తమకు మద్దతిస్తున్నారని, కొందరు తమకు మద్దతుగా నిలవడం లేదన్నారు. కానీ తాము మాత్రం ప్రజల సమస్యలను ప్రస్తావిస్తామన్నారు.
OBC ఉద్యోగులు దేశంలో పది శాతం కూడా లేరని టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు చెప్పారు. ఈ విషయమై తాము ఆయా శాఖల నుండి సమాచారాన్ని సేకరించామన్నారు.ఈ సమాచారం చూస్తే ఆశ్చర్యం వేస్తుందన్నారు. కుల గణన ఆధారంగా సరైన సమాచారం ఉంటే ఉద్యోగాల్లో నియామాకాలు జరిగేవన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో 35 శాతం ఉద్యోగాలు కల్పించినట్టుగా కేశవరావు చెప్పారు.
లోక్‌సభలో టీఆర్ఎస్ పక్ష నేత Nama Nageswara rao మాట్లాడుుతూ రాష్ట్రానికి సంబంధించిన అన్ని సమస్యలను తాము పార్లమెంట్ ఉభయ సభల్లో లేవనెత్తుతున్నామన్నారు. కుల గణన చేపట్టాలని తాము ఉభయ సభల్లో ఇవాళ వాయిదా తీర్మాణాలు చేపట్టామన్నారు. 1931లోనే కుల గణన జరిగిందన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేండ్లు అయినా కూడా కుల గణన జరగలేదన్నారు. కుల గణన చేయాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని ఎంపీ నామా నాగేశ్వరరావు గుర్తు చేశారు.
ఇవాళ పార్లమెంట్ ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఎంపీలు కుల గణనపై వాయిదా తీర్మానాలు ఇచ్చారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఇవాళ ఆ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. కుల గణన చేపట్టాలని ఆయన కోరారు. ఇక రాజ్యసభలోనూ టీఆర్ఎస్ ఎంపీ కే కేశవ రావు ఇదే అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చారు. కుల గణన అంశంపై చర్చ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి కుల గణన అంశం పెండింగ్‌లో ఉందని ఎంపీ నామా అన్నారు. గతంలో ఈ అంశంపై ప్రభుత్వం హామీ ఇచ్చిందని, దేశ ప్రయోజనం కోసం కుల గణన చేపట్టాలని ఆయన కోరారు.