ఇటీవల న్యూడిల్లీ నుండి తిరిగివచ్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డికి కరోనా నిర్దారణ కాగా తాజాగా రాజ్యసభ సభ్యులు కేశవరావు కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు.
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కలకలం (corona outbreak in telangana) కొనసాగుతోంది. ఇప్పటికే సామాన్యులు మొదలు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు చాలామంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా టీఆర్ఎస్ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యులు కేశవరావు (keshav rao)కు కరోనా సోకింది. కాస్త అనారోగ్యంగా వుండటంతో కరోనా పరీక్ష చేయించుకున్న ఆయనకు పాజిటివ్ (corona positive) గా నిర్దారణ అయ్యింది.
అయితే ప్రస్తుతం కేశవరావుకు కరోనా వల్ల ఎలాంటి సమస్య లేకపోవడంతో హోంఐసోలేషన్ (home isolation) లో వుండాలని డాక్టర్లు సూచించారు. దీంతో తన నివాసంలోనే వుంటూ కరోనా చికిత్స పొందుతున్నారు ఎంపీ కేశవరావు. ఆయన ప్రస్తుతం ఆరోగ్యంగానే వున్నారని... ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు.
ఇటీవలే పార్లమెంట్ సమావేశాలు ముగియడంతో కేశవరావు దేశ రాజధాని న్యూడిల్లీ (new delhi) నుండి హైదరాబాద్ (hyderabad) కు వచ్చారు. కానీ సమావేశాల సమయంలో డిల్లీలోనే వున్న ఆయన సహచర ఎంపీలు, రాష్ట్ర మంత్రుల బృందంతో కలిసి కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ (piyush goyal) ను కలిసారు. అలాగే రాజ్యసభ సమావేశాల్లో పాల్గొన్నారు.
read more Omicron విజృంభణ వేళ కలకలం... మంత్రి ఎర్రబెల్లి, ఎంపీ రంజిత్ రెడ్డికి కరోనా పాజిటివ్
ఇలా ఇటీవల కేశవరావు న్యూడిల్లీతో పాటు హైదరాబాద్ లో చాలామందిని కలిసారు. ఆయన కలిసినవారిలో కేంద్ర మంత్రులతో పాటు కాంగ్రెస్ సీనియర్లు, టీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు, నాయకులు కార్యకర్తలు వున్నారు. కాబట్టి తనను ఇటీవల కాలంలో కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని కేశవరావు సూచించారు.
ఇక నాలుగురోజుల క్రితమే తెలంగాణ పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు (errabelli dayakar rao)కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోలుపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరడానికి రాష్ట్ర మంత్రుల బృందం దేశరాజధాని డిల్లీలో పర్యటించింది. ఈ బృందంలో మంత్రి ఎర్రబెల్లి కూడా వున్నారు. న్యూడిల్లీ నుండి తిరిగివచ్చిన మంత్రి కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో హోంక్వారంటైన్ లోకి వెళ్లిన మంత్రి ఎర్రబెల్లి తనను కలిసిన వారు కరోనా పరీక్ష చేయించుకోవాలని సూచించారు.
read more తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. ఒక్కరోజులో 235 మందికి పాజిటివ్, హైదరాబాద్‌లో అత్యధికం
ఇక టీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి (ranjith reddy)కి కూడా కరోనా సోకింది. ఈయన ఇటీవలే ముగిసిన పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన్నారు. సమావేశాలు ముగిసిన తర్వాత రాష్ట్రానికి విచ్చేసారు. అయితే ఆయన కోవిడ్ టెస్ట్ చేసుకోగా పాజిటివ్ గా నిర్దారణ కావడంతో హోంక్వారంటైన్ లోకి వెళ్లిపోయారు.
మంత్రి ఎర్రబెల్లి, ఎంపీ రంజిత్ రెడ్డితో పాటు తాజాగా కేశవరావుకు కూడా కరోనా నిర్దారణ అయ్యింది. దీంతో న్యూడిల్లీ పర్యటనకు వెళ్లిన మంత్రుల బృందం, టీఆర్ఎస్ ఎంపీల్లో ఆందోళన నెలకొంది. అంతేకాకుండా ఇటీవల వీరిని కలిసిన నాయకులు కూడా ఆందోళనకు గురవుతున్నారు.
