నిజామాబాద్ ఎంపి కల్వకుంట కవిత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్ జిల్లా పొతంగల్ లోని 177 నంబర్ బూత్ లో భర్తతో కలిసి వచ్చి ఓటేశారు. అయితే అందరు ఓటర్ల మాదిరిగానే కవిత కూడా క్యూలో నిల్చుని ఓటేశారు. 

తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో ప్రముఖులందరు కూడా తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు కూడా సామాన్యులతో కలిసి క్యూలో నిల్చుని మరి ఓటేస్తున్నారు. 

ఇవాళ ఉదయం ప్రారంభమైన పోలింగ్ ఉదయం 9 గంటల వరకు 10 శాతం ఓట్లు పోలైనట్టుగా  ఎన్నికల సంఘం ప్రకటించింది.కొన్ని చోట్ల  చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ కు అంతరాయం కలుగుతోంది. అలాగే మరికొన్ని చోట్ల గుత్తా జ్వాల వంటి సెలబ్రిటీల ఓట్లు కూడా గల్లంతయ్యాయి.