Asianet News TeluguAsianet News Telugu

చీరలు అమ్మిన కవితక్క.. సంపాదన ఎంతంటే..

ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు టీఆర్ఎస్ పార్టీ గులాబీ కూలీ దినాలుగా పాటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆమె ఈ రోజు నిజామాబాద్ ఎల్వీఆర్ షాపింగ్ మాల్‌లో వినియోగదారులకు చీరలు అమ్మారు.

trs mp kavitha participate in gulabi cooli dinalu

టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు పార్టీ నేతలందరూ కూలీ పనులతో ఈ మధ్య బిజీ అయిపోయారు. పార్టీ ప్లీనరీ, బహిరంగ సభకు గులాబీ నేతలు, కార్యకర్తలు అందరూ శ్రమదానం చేసి, కూలీ పనులతో సంపాదించి వచ్చే ఆ మొత్తంతోనే సభలకు రావాలని సీఎం కేసీఆర్ సూచించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే మొన్న మంత్రి కేటీఆర్ ఐస్ క్రీం పార్లర్ లో ఐస్ క్రీం అమ్మి రూ. 5 లక్షలు సంపాదించారు. ఇప్పుడు టీఆర్ఎస్ ఎంపీ కవిత వంతు వచ్చింది. ఆమె కూడా గులాబీ కూలి దినాల్లో భాగంగా ఆదివారం చీరలమ్మారు.

ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు టీఆర్ఎస్ పార్టీ గులాబీ కూలీ దినాలుగా పాటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆమె ఈ రోజు నిజామాబాద్ ఎల్వీఆర్ షాపింగ్ మాల్‌లో వినియోగదారులకు చీరలు అమ్మారు. అలా అమ్మి ఎంత సంపాదించారో తెలుసా.. అక్షరాల  ఏడు లక్షల రూపాయలు.

అంటే కేటీఆర్ కంటే ఈ విషయంలో కవితక్కే కాస్త ఎక్కువ సంపాదించారని చెప్పొచ్చు.త్వరలో పార్టీ అధినేత కేసీఆర్ కూడా కూలీ పని చేయనున్నట్లు తెలిసిందే. ఆయన ఎంత సంపాదిస్తారో చూడాలి.

 

Follow Us:
Download App:
  • android
  • ios