రాఖీ గిఫ్ట్: కవిత మంత్రి కేటీఆర్ కు ఏం బహుమతి ఇచ్చిందో తెలుసా..!

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 26, Aug 2018, 3:03 PM IST
TRS MP kavitha gifts helmet to minister ktr
Highlights

తెలంగాణ రాష్ట్ర మున్సిఫల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు ఆయన సోదరి నిజామాబాద్ ఎంపీ రక్షాబంధన్ సందర్భంగా హెల్మెట్ ను బహుమతిగా ఇచ్చారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మున్సిఫల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు ఆయన సోదరి నిజామాబాద్ ఎంపీ రక్షాబంధన్ సందర్భంగా హెల్మెట్ ను బహుమతిగా ఇచ్చారు.

రక్షాబంధన్ ను పురస్కరించుకొని ఆదివారం నాడు నిజామాబాద్ ఎంపీ కవిత మంత్రి కేటీఆర్ కు ఆదివారం నాడు రాఖీ కట్టారు. రాఖీ కట్టిన తర్వాత సోదరుడి ఆశీర్వాదం తీసుకొన్నారు. రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని కవిత తన సోదరుడు కేటీఆర్ కుహెల్మెట్ ను బహుకరించారు.

 

సిస్టర్ ఫర్ ఛేంజ్ పేరుతో కవిత హెల్మెట్ ను బహుమతిగా ఇవ్వాలని ఇటీవలనే ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగానే మంత్రి కేటీఆర్ కు రాఖీ కట్టిన తర్వాత ఆయనకు కవిత హెల్మెట్ ను బహుమతిగా ఇచ్చారు

హెల్మెట్ లేని కారణంగా రోడ్డు ప్రమాదానికి గురైన చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలనే ఉద్దేశ్యంతోనే హెల్మెట్ ను రాఖీ పర్వదినం సందర్భంగా ఇవ్వాలని కవిత క్యాంపెయిన్ ను ప్రారంభించింది. ఈ క్యాంపెయిన్ లో బ్రిటన్ హై కమిషనర్ కూడ మూడు రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు.

loader