నిజామాబాద్: ప్రధాని నరేంద్రమోదీపై టీఆర్ఎస్ నేత నిజామాబాద్ ఎంపీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీ నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్ నే నిజామాబాద్ సభలో ప్రధాని మోదీ చదివారని కవిత విమర్శించారు. రాష్ట్రాభివృద్ధి విషయంలో ప్రధాని మోదీ చేసిన విమర్శలపై కవిత కౌంటర్ ఇచ్చారు. 

మోదీ ఆరోపణలను కవిత తిప్పికొట్టారు. నిజామాబాద్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి అదనంగా రూ.173 కోట్లు కేటాయించినట్లు చెప్పుకొచ్చారు. జిల్లా ప్రజలకు ఉన్న దూరదృష్టి మోదీకి లేకపోవడం బాధాకరం అని కవిత పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే మెడికల్ కాలేజీలో అన్ని వసతులు కల్పించామన్నారు. 

జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ఎన్నోసార్లు కేంద్రాన్ని అభ్యర్థించామని, అయినా కేంద్రం ఇప్పటి వరకు పసుపు బోర్డు ప్రకటించలేదన్నారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాల్సింది పోయి విమర్శలా అంటూ నిలదీశారు. 

 

ఈ వార్తలు కూడా చదవండి

ముస్లిం కోటాపై మోడీకి కేసీఆర్ సవాల్

ప్రజాకూటమికి ఓటెస్తే అరాచకమే,టీఆర్ ఎస్ కు ఓటేస్తే సంక్షేమం:కేసీఆర్

నేను ఏ పూజ చేసుకుంటే నీకెందుకు: మోడీకి కేసీఆర్ కౌంటర్