నిజామాబాద్‌ : కాంగ్రెస్‌ వెనక చంద్రబాబు నీడ ఉందని అది గమనించి ప్రజలు ఓట్లు వేయాలంటూ నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన కవిత 60 ఏండ్లలో అన్నదాతలను ఏ పార్టీ పట్టించుకున్న పాపాన పోలేదని కానీ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని చెప్పారు. 

ఇళ్లు లేని నిరుపేదల కోసం ఏపార్టీ ఆలోచించలేదని ఒక్క టీఆర్ఎస్ ఆలోచించిందన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు పథకాన్ని ప్రవేశపెట్టింది టీఆర్ఎస్ అన్నారు. స్థలం ఉండి ఇళ్లు కట్టుకుంటే రూ. 5 లక్షల అప్పు ఇస్తాం అని కాంగ్రెస్‌ చెబుతోంది, కానీ టీఆర్‌ఎస్‌ ఇచ్చే ఐదు లక్షల రూపాయలు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు.

టీఆర్‌ఎస్‌కు మత, కుల పిచ్చి లేదని వివరించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగలంటే టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించండంటూ కవిత ప్రజలను కోరారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తి చేసిందని చంద్రబాబు వస్తే వాటిన్నింటికి చంద్ర గ్రహణం పడుతుందని హెచ్చరించారు. కాంగ్రెస్‌ వెనక చంద్రబాబు నీడ ఉంది అది గమనించి ఓటు వేయాలంటూ కవిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు.