జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ హిందూ ఎజెండాకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవ రావు కౌంటర్ ఇచ్చారు. అందరికీ న్యాయం చేయాలని అనుకోవడమే నిజమైన హిందూత్వమని ఆయన అన్నారు హిందూత్వం గురించి మాట్లాడుకుంటే తెలంగాణ సీఎం కేసీఆర్ నుంచి మించిన పెద్ద హిందువు ఎవరూ లేరని కేకే వ్యాఖ్యానించారు కేసీఆర్ చేసినన్ని యాగాలు, యజ్ఞాలు ఎవరూ చేయలేదని ఆయన చెప్పారు 

హైదరాబాద్‌లో సంభవించిన వరదల కారణంగా ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ చలించిపోయారని తెలిపారు టీఆర్ఎస్ ఎంపీ కే. కేశవరావు.

హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు అండగా నిలబడేందుకు గాను రూ.500 కోట్లు విడుదల చేసి కుటుంబానికి రూ.10 వేల సాయం అందించామని పేర్కొన్నారు.

అయితే కొన్ని శక్తులు ఆ వరద సాయాన్ని నిలిపివేయించాని కేకే మండిపడ్డారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తాను ఈసీకి లేఖ రాయలేదని, తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని చెబుతున్నారని..అయితే అంతకు ముందు నుంచే వరద సాయంపై బీజేపీ నేతలు అభ్యంతరం చెప్పిన విషయాన్ని కేకే గుర్తుచేశారు.

అసలు అభ్యంతరం తెలపడమే లెటర్ కంటే పెద్ద వ్యవహారమని కేశవరావు చెప్పారు. పేదలకు సాయం చేయాలని భావించం పాపమా అని కేశవరావు నిలదీశారు.

వరద సాయం టీఆర్ఎస్‌కు మేలు చేస్తుందని ముందు నుంచే కాషాయ దళాలు చెబుతున్నాయని కేకే గుర్తుచేశారు. ఎవ్వరూ ఆపినా, ఆపకపోయినా పేదలకు సాయం చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.