సీఎం అపాయింట్‌మెంట్ కోసం డీఎస్ ఎదురుచూపులు


హైదరాబాద్: టీఆర్ఎస్ ఎంపీ, మాజీ మంత్రి డి.శ్రీనివాస్ కు సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్ దక్కలేదు.బుధవారం సాయంత్రం కేసీఆర్ అపాయింట్ మెంట్ ఉందని ప్రచారం జరిగింది. కానీ, ఇంతవరకు డీఎస్ కు ఎలాంటి అపాయింట్ ఇవ్వలేదని సమాచారం. సీఎం అపాయింట్ మెంట్ కోసం ఇవాళ ఉదయం నుండి ఎదురు చూస్తున్నారు. 

నిజామాబాద్ నుండి ముఖ్యమంత్రిని కలిసేందుకు గాను డీఎస్ హైద్రాబాద్ కు వచ్చారు. సీఎం అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ విషయమై సీఎం కేసీఆర్ నుండి డీఎస్‌కు అపాయింట్‌మెంట్ దొరకలేదు.

సీఎం అపాయింట్‌మెంట్ కోసం డీఎస్ ఎదురు చూస్తున్నారు. సీఎం తో సమావేశమైన తర్వాత డీఎస్ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. డీఎస్ కు కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇచ్చారని సీఎంఓ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. కానీ,ఈ విషయమై డీఎస్‌కు సమాచారం లేదని ఆయన ప్రకటించారు. సీఎంను కలిసేందుకు తాను ప్రయత్నిస్తున్నట్టు డీఎస్ చెప్పారు.