Asianet News TeluguAsianet News Telugu

జగిత్యాల నుండే టీఆర్ఎస్ జైత్రయాత్ర: కేసీఆర్ సభకు బయలుదేరిన కవిత

జగిత్యాలలో జరిగే సీఎం కేసీఆర్ సభకు హైద్రాబాద్ నుండి  టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భారీ కాన్వాయిత్ బయలుదేరారు.  జగిత్యాలలో  ఇవాళ సీఎం కేసీఆర్ పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటారని  కవిత  చెప్పారు.

TRS  MLC Kavitha  leaves For jagtial
Author
First Published Dec 7, 2022, 9:29 AM IST

హైదరాబాద్: జగిత్యాల నుండే టీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభం కానుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత  చెప్పారు.బుధవారంనాడు హైద్రాబాద్ లో తన నివాసం వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. ఇవాళ సీఎం కేసీఆర్ జగిత్యాల జిల్లాలో నిర్వహించే  సభలో  పాల్గొనేందుకు భారీ కాన్వాయితో బయలుదేరుతున్నట్టుగా ఆమె చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాతే  అనేక  కార్యక్రమాలను చేపట్టిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. పంట పొలాలకు నీటి వనరులు,  రెవిన్యూ డివిజన్లు, కొత్త మండలాలు, కొత్త జిల్లాల ఏర్పాటు  తెలంగాణలోనే సాధ్యమైందని ఆమె గుర్తు చేశారు.తెలంగాణలో కేసీఆర్ సర్కార్ చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలతో ప్రజలు ఇబ్బందులు లేకుండా జీవనం సాగిస్తున్నారని కవిత చెప్పారు.జగిత్యాలలో మెడికల్ కాలేజీని  రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.ఈ కాలేజీల్లో ఆన్ లైన్ లో  తరగతులను కేసీఆర్ ప్రారంభించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. జగిత్యాలలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీకి సంబంధించిన స్వంత భవనం నిర్మాణానికి  ఇవాళ  సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని కవిత వివరించారు. 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  సీబీఐకి తాను రాసిన లేఖకు రిప్లై కోసం కవిత  నిన్న  ఎదురు చూశారు. నిన్న సాయంత్రం ఐదు గంటల తర్వాత సీబీఐ నుండి కవితకు సమాచారం అందింది. వాస్తవానికి నిన్న ఉదయం 11 గంటలకే కవిత  జగిత్యాల బయలుదేరి వెళ్లాల్సి ఉంది. కానీ సీబీఐ అధికారుల నుండి సమాచారం కోసం ఎదురు చూశారు. 11 గంటలకు బయలుదేరాల్సిన కవిత మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత జగిత్యాల పర్యటనకు వెళ్లాలని తన టూర్ షెడ్యూల్ ను మార్చుకున్నారు. అయితే  ఈ నెల 5వ తేదీన సాయంత్రమే హైద్రాబాద్ నగరానికి  నలుగురు సీబీఐ అధికారులు న్యూఢిల్లీ నుండి వచ్చారు. దీంతో సీబీఐ నుండి  సమాచారం  కోసం కవిత ఎదురు చూశారు. ఈ నెల 6వ తేదీన  సీబీఐకి వివరణ ఇచ్చేందుకు సమయం ఇచ్చారు. ఆ తర్వాత ఈ నెల 11,12, 14,15 తేదీల్లో ఏదో ఒక రోజున  తాను సీబీఐ అధికారులతో సమావేశం కావడానికి సిద్దంగా  ఉన్నట్టుగా  కవిత  సీబీఐకి సమాచారం పంపారు.ఈ విషయమై నిన్న సాయంత్రం సీబీఐ అదికారుల నుండి కవితకు సమాచారం అందింది. 

ఈ నెల 11 వ తేదీన కవిత నుండి వివరణ తీసుకునేందుకు వస్తున్నట్టుగా  సీబీఐ అధికారులు కవితకు మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చారు. సీబీఐ నుండి సమాచారం  కోసం ఎదురుచూసిన కవిత  జగిత్యాల టూర్ ను చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. ఇవాళ ఉదయం  హైద్రాబాద్ నుండి జగిత్యాలకు బయలు దేరారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios