తెలంగాణ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ గౌరవ అధ్యక్షురాలిగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నియమితులయ్యారు. ఈ సందర్భంగా టీఎంయూ నేత థామస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ సహకారంతోనే ఆర్టీసీ మనుగడ అన్నారు. 

తెలంగాణ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ గౌరవ అధ్యక్షురాలిగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నియమితులయ్యారు. ఈ సందర్భంగా టీఎంయూ నేత థామస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ సహకారంతోనే ఆర్టీసీ మనుగడ అన్నారు. అశ్వద్ధామరెడ్డి బీజేపీలో చేరి కార్మికులను గాలికొదిలేశారని థామస్ రెడ్డి ఆరోపించారు. టీఎంయూను ముక్కలు చేయాలనే ప్రయత్నాలు విఫలమయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. టీఎంయూకు అశ్వద్ధామరెడ్డి రాజీనామా చేశారని థామస్ రెడ్డి చెప్పారు. టీఎంయూకు అశ్వద్ధామరెడ్డికి ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు. అశ్వద్ధామరెడ్డిపై చీటింగ్ కేసు పెడతామని థామస్ రెడ్డి చెప్పారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred