బాల్కొండ నియోజకవర్గంలోని ఎర్గట్లకు ఆరు నెలల క్రితం కంప్రెషర్ బండి నడిపే సుభాష్ అనే కార్మికుడు నల్లగొండ నుంచి వెళ్లి నివాసముంటున్నాడు. స్థానికంగా క్వారీలో తన కంప్రెష్షర్ బండితో పనిచేస్తున్నాడు. తనను ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తమ్ముడు వంశీరెడ్డి వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తాను చేసే పనికి ఇచ్చే డబ్బు సరిపోతలేదని పెంచాలని అడిగాడు. అయితే పెంచేదిలేదని కంప్రెషర్ బండి అమ్మాలని సుభాష్ పై వత్తిడి చేశారు. బండి అమ్మినా.. ఆ సొమ్ము ఇవ్వకుండా బూతులు తిడుతూ పోలీసుల పేరు చెప్పి బెదిరిస్తున్నారని బాధితులు చెబుతున్నారు. ఆ బాధితుడికి కాంగ్రెస్ నేత రాజారాం యాదవ్ అండగా నిలిచారు. సుభాష్ చెప్పిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాధితుడు చెబుతున్న పూర్తి వివరాలు కింద వీడియోలో చూడొచ్చు.