టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం (వీడియో)

TRS MLA Putta Madhu convoy accident
Highlights

అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే  తృటిలో ప్రమాదం నుండి తప్పించుకున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే పుట్టా మధు కాన్వాయ్ మంచిర్యాల జిల్లాలో ప్రమాదానికి గురయ్యింది. అయితే ఈ ప్రమాదం ఎమ్మెల్యే మధు తృటిలో తప్పించుకున్నారు.
 
ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... మంచిర్యాల జిల్లాలో జరిగిన  ఓ శుభ కార్యక్రమానికి ఎమ్మెల్యే పుట్టా మధు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి వెళుతున్న క్రమంలో ఆయన కాన్యాయ్ లోని ఓ కారు ప్రమాదానికి గురయ్యింది. ఇందారం గ్రామం వద్ద ఎమ్మెల్యే కాన్వాయ్ లో ఓ కారు బస్సును ఓవర్ టెక్ చేయబోయి అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో కార్లులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదం జరిగిన కారులో పుట్టా మధు సమీప బంధువు సురేందర్ కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే మధు సురక్షితంగా బైటపడ్డారు. 

"
  
loader