మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా...భార్యాకుమారులకు కూడా

అధికార తెలంగాణ రాాష్ట్ర సమితి పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే కరోనా బారినపడ్డారు. 

TRS MLA Mynampally Hanumantharao tests positive for corona

హైదరాబాద్: తెలంగాణలో మరో ఎమ్మెల్యే కరోనా బారినపడ్డారు. హైదరాబాద్ పరిధిలోని మల్కాజిగిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యె మైనంపల్లి హనుమంతరావు కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా తేలింది. అయితే ఆరోగ్య పరిస్థితి బాగానే వుండటంతో ఆయన హోంక్వారంటైన్ లో వుంటూ చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే తో పాటు ఆయన సతీమణి, ఓ కుమారుడికి కూడా కరోనా సోకింది. వారు కూడా ఇంట్లోనే వుండి చికిత్స పొందుతున్నారు. 

మరోవైపు తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తాజాగా మళ్లీ పెరిగింది. గత 24గంటల్లో(ఆదివారం రాత్రి 8గంటల నుండి సోమవారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 45,021 మందికి కరోనా టెస్టులు చేయగా 1536 మందికి పాజిటివ్ గా తేలినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 43,94,330కి చేరగా మొత్తం కేసుల సంఖ్య 2,42,506కు చేరాయి. 

ఇక ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్న వారిలో 1421మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 2,23,413కు చేరింది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్  కేసుల సంఖ్య 17,742కు చేరింది. 

 అయితే కరోనా బారినపడ్డ వారిలో గత 24గంటల్లో ముగ్గురు మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1351కి చేరింది. కరోనా మరణాల సంఖ్య రాష్ట్రంలో 0.55, దేశంలో 1,5శాతాలుగా వుండగా రికవరీ రేటు రాష్ట్రంలో 92.12, దేశంలో 91.7 శాతంగా వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. 

జిల్లాలవారిగా చూసుకుంటే జిహెచ్ఎంసీ (హైదరాబాద్) లో అత్యధికంగా 281 కేసులు బయటపడితే ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 123మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు.  కరీంనగర్ 76, ఖమ్మం 97, మేడ్చల్ 96, నల్గొండ 81, రంగారెడ్డి 92, వరంగల్ అర్బన్ 49 కేసులు బయటపడ్డాయి. మిగతాజిల్లాల్లో కేసుల సంఖ్య తక్కువగా వుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios