శుభకార్యానికి వెళ్లివస్తూ మల్కాజిగిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప్రమాదానికి గురయ్యారు.  ఓ హోటల్లో జరిగిన లిప్ట్ ప్రమాదంలో చిక్కుకున్న అతడికి స్వల గాయాలయ్యాయి. మైనంపల్లితో పాటుమ మరికొంతమంది టీఆర్ఎస్ నాయకులు కూడా ఆ ప్రమాదం స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. 

ఈ ప్రమాదానికి సంబంధించిన  వివరాలిలా ఉన్నాయి. ఎమ్మెల్యే మైనంపల్లి బుధవారం చిక్కడపల్లిలో ఓ శుభకార్యానికి హాజరయ్యారు. అనంతరం తిరిగి వెళుతుండగా ఆయనెక్కిన లిప్ట్ ఒక్కసారిగా ప్రమాదానికి గురయ్యింది. లిప్ట్ వైర్ తెగిపోవడంతో వేగంగా దూసుకువస్తూ కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యేతో పాటు ఇతర టీఆర్ఎస్ నాయకులకు స్వల్ఫ గాయాలయ్యాయి.

ఈ ప్రమాదంలో మైనంపల్లి ఎడమ కాలికి గాయమయ్యింది. దీంతో అతడికి హుటాహుటిన సికింద్రాబాద్ యశోదాకు తరలించి చికిత్స అందించారు. ఎమ్మెల్యేకు అయిన గాయం అంత పెద్దదేమీ కాదని...ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే వుందని డాక్టర్లు తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు గాయపడిన నాయకులను కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ పరామర్శించారు.