తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీని టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కలిశారు. ఈ నెల 15న మల్కాజ్‌గిరిలో జరిగిన గొడవ విషయమై హోంమంత్రితో చర్చించారు హనుమంతరావు. 

తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీని టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కలిశారు. ఈ నెల 15న మల్కాజ్‌గిరిలో జరిగిన గొడవ విషయమై హోంమంత్రితో చర్చించారు హనుమంతరావు. ఇప్పటికే మైనంపల్లి, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. మరోవైపు జాతీయ ఎస్సీ కమీషన్ వైస్ ఛైర్మన్‌ను కలిసిన బాధితులు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆగస్టు 15న జెండా ఆవిష్కరణ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సందర్భంగా జాతీయ ఎస్సీ కమీషణ్ వైస్ ఛైర్మన్ అరుణ్ అల్దార్ బాధితులను కలిసి పరామర్శించారు. అనంతరం దిల్ కుష్ అతిథి గృహంలో పోలీసు అధికారులతో భేటీ అయ్యారు. 

Also Read:కులం పేరుతో దళితులపై దూషణలు.. రేపు హైదరాబాద్‌కు జాతీయ ఎస్సీ కమీషన్, చిక్కుల్లో మైనంపల్లి

కాగా, టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఆయన అనుచరులు దళిత మహిళలను కులం పేరుతో దూషించడాన్ని దళిత సంఘాలు జాతీయ ఎస్సీ కమీషన్ దృష్టికి తీసుకెళ్లాయి. ఆందోళనకు దిగిన దళిత మహిళలను అరెస్ట్ చేసి పేట్ బషీర్‌బాగ్ పీఎస్‌లో అర్ధరాత్రి వరకు వుంచడాన్ని కమీషన్ సీరియస్‌గా పరిగణించింది.